కరోనా కాలంలో ఎక్కడో మహారాష్ట్రలో ఓ వ్యక్తి బంగారు మాస్క్ తయారు చేయించుకున్నట్లు మీడియాలో చూశాం. ఇపుడు గుంటూరు జిల్లాలో వ్యక్తి బంగారు వర్ణంతో కూడిన మాస్కు ధరించటం అందరినీ ఆకట్టుకుంది. తుళ్లూరు మండలం మందడంలోని అమరావతి రైతుల దీక్ష శిబిరం వద్ద శాస్త్రి అనే వ్యక్తి విభిన్నమైన మాస్కుతో కనిపించారు. ఇటీవల తాను ఓ వివాహానికి హాజరయ్యానని.. పెళ్లి వారు అతిథులకు ఇలాంటి మాస్కులు పంపిణీ చేశారని తెలిపారు. రెక్సిన్తో తయారు చేసినట్లు చెప్పారు. చూడగానే ఎవరైనా బంగారు మాస్క్ అని భ్రమించేలా ఉంది. అక్కడ ఉన్న వారు ఈ మాస్కు ని ఆసక్తిగా గమనించారు.
అందరూ చూసి బంగారు మాస్క్ అనుకున్నారు...కానీ..! - corona cases in ap
తుళ్లూరు మండలం మందడంలోని అమరావతి రైతుల దీక్ష శిబిరం వద్ద శాస్త్రీ అనే వ్యక్తి ధరించిన మాస్క్ అందర్నీ ఆకట్టుకుంది.
rexin mask