తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్న వెంకన్న... బ్యాంకులో జమ చేయాల్సిన రూ.30 లక్షల నగదుతో ఉడాయించాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ మేరకు బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఖమ్మంలోని సీఐఎస్సీవో అనే ప్రైవేటు ఏజెన్సీలో వెంకన్న పదేళ్లుగా పని చేస్తున్నాడు. బ్యాంకుల్లో నగదు తీసుకొని ఏటీఎంలలో పెట్టడం... ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్‌కు నగదును తరలించడం అతని పని. ఈనెల 11న నిందితుడు వెంకన్న... గాంధీ చౌక్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు వెళ్లి వైరా రోడ్డులోని ప్రధాన శాఖవారు రూ.30 లక్షలు తీసుకురమ్మన్నారని వోచర్ చూపించాడు.