ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గొలుసుకట్టు సంస్థలో డబ్బు రాలేదని ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో గొలుసుకట్టు మోసాలు తగ్గడం లేదు. తాజాగా ఓ యువకుడు గొలుసుకట్టు సంస్థలో చెల్లించిన డబ్బులు సమయానికి రాకపోవటంపై.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు జరిగిన మోసాన్ని సెల్ఫీ వీడియో తీసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో కలకలం సృష్టించింది.

By

Published : Apr 14, 2021, 6:43 PM IST

suicide attempt by a member of chain marketing scheme
గొలుసుకట్టు సంస్థలో డబ్బు రాలేదని ఆత్మహత్యాయత్నం

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన అంజాద్ అనే యువకుడు గొలుసుకట్టు సంస్థలో డబ్బులు పెట్టి మోసపోయాడు. ఎంత డబ్బులు కడితే అంతకు రెట్టింపు పైసలు వస్తాయని ఆ సంస్థ ఏజెంట్​ అంజాద్ చెప్పాడు. ఇది నమ్మిన అతను లక్ష 20 వేలు ఏజంట్​కు ఇచ్చాడు.

గొలుసుకట్టు సంస్థలో డబ్బు రాలేదని ఆత్మహత్యాయత్నం

కొన్ని రోజుల తర్వాత డబ్బులు ఇవ్వాలని ఏజెంట్ ఇంటి వద్దకు వెళ్తే తనను మెడపట్టి బయటకు గెంటేశారని చెప్పాడు. మనస్తాపం చెందిన అంజాద్... పురుగుల మందు తీసుకుని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి సెల్ఫీ వీడియోలో తన బాధను తెలుపుతూ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో వీడియో షేర్ చేశాడు. గ్రామస్థులు అతని కోసం వెతకగా కాకుల గుట్ట తండా శివారులోని గొట్టం చెరువు ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అంజాద్​ను వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అంజాద్ చికిత్స పొందుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details