తెలంగాణలోని జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో కోతులు ఇళ్లు, దుకాణాల్లోకి చొరబడి అందినకాడికి వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. పండ్ల చెట్లపై గెంతులేస్తూ.. నష్టం కలిగిస్తున్నాయి.
వానరాల బెడద నివారణకు నిమ్మల యాదగిరి అనే వ్యక్తి తన ఇంటి పెరట్లోని మామిడి చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలి అనుకున్నాడు. చెట్టు నిండా ఇలా రేగు కంపతో నింపేశారు. కంప కారణంగా కోతులు రాకపోవడంతో ఆయన ఉపాయం ఫలించింది.