ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన భార్య.. భర్త ఏం చేశాడంటే..? - నిజామాబాద్​లో హత్య

వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాలను బలిగొన్న ఘటన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

man murdered at aryanagar in nizamabad
ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన భార్య.. ఆవేశంతో భర్త ఏం చేశాడంటే..?

By

Published : Nov 1, 2020, 10:47 PM IST

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్​లో ఓ వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాలను బలిగొంది. నగరంలోని ఆర్యనగర్​లో ఉమాకాంత్​ అనే వ్యక్తి భార్యతో పాటు ఉంటున్నాడు. శనివారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి అతని భార్య.. సాల్మాన్ రాజ్(24) అనే వ్యక్తితో ఉంది.

భార్య వేరొకరితో ఉండడం చూసిన ఉమాకాంత్..​ ఆవేశంతో సాల్మాన్ రాజ్ తలపై రాడ్​తో దాడి చేశాడు. ఈ ఘటనలో సల్మాన్​ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి:తాగినమైకంలో ఏటీఎం చోరీకి యత్నం... స్థానికుల దేహశుద్ధి

ABOUT THE AUTHOR

...view details