తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన నరుకుడి ప్రణయ్ అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఇంట్లో ఉండగా, రాత్రి చరవాణికి ఫోన్ కాల్ వచ్చాక.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లుగా కుటుంబీకులు తెలిపారు. మళ్లీ ప్రణయ్ తిరిగి ఇంటికి రాలేదని తెలిపారు. తెల్లవారుజామున అంబేడ్కర్ కమ్యూనిటీ భవనం వద్ద ప్రణయ్ మృతదేహం కనబడటం వల్ల గ్రామీణులు భయాందోళనకు గురయ్యారు.
ప్రణయ్ తలపై బలమైన గాయం మాత్రమే ఉండగా, అక్కడ ఎలాంటి రక్తపు మరకలు లేకపోవటం వల్ల ఎక్కడో చంపి.. మృతదేహన్ని తీసుకొచ్చి కాలనీ సమీపంలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రణయ్ తన ఇంటి సమీపంలోని ఓ యువతితో గత సంవత్సర కాలంగా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యవహరమే హత్యకు కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.