సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మద్యం ప్రియులు ఉదయం నుంచే దుకాణాల ముందు బారులుతీరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల.. దుకాణాల ముందు భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాటు చేసిన సర్కిళ్లలో తమ చెప్పుల జతలను ఉంచుతున్నారు.
ఇన్ని రోజుల తర్వాత దుకాణం తెరుస్తుండటం వల్ల ఓ మద్యం ప్రియుడు ఆనందంతో దుకాణానికి మంగళ హారతి ఇచ్చి.. కొబ్బరికాయ కొట్టాడు. దుకాణాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.