హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపైకి నీరు చేరి వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద వ్యక్తి గల్లంతయ్యాడు. డ్రైనేజీ పైప్‌లైన్ కోసం తవ్విన గుంతలో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. వర్షపు నీటితో నిండటంతో దారి కనబడక గుంతలో పడ్డాడు. స్థానికుల సమాచారంతో గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్ మణికొండలో గుంతలో పడి వ్యక్తి గల్లంతు