ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంత్యక్రియలు పూర్తయ్యాక తెలిసింది... కరోనా అని! - కరోనా వ్యాప్తి

ఓ వ్యక్తి చనిపోయాడు. అతనికి కుటుంబసభ్యులు, గ్రామస్థులు, స్నేహితులు కన్నీటి వీడ్కోలు చెప్పారు. అంత్యక్రియలు ముగిశాక అంతా.. స్వగృహాలకు వెళ్లారు. ఇంతవరకు బాగానే ఉన్నా... అప్పుడే వారికో విషయం తెలిసింది. అతను కరోనాతో చనిపోయాడని. ఇంకేముంది అందరిలోనూ టెన్షన్ మొదలైంది.

corona cases at Warangal
అంత్యక్రియలు పూర్తయ్యాక తెలిసింది... కరోనా అని!

By

Published : Apr 15, 2021, 4:32 PM IST

తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. మంగళవారం రాత్రి మరణించాడు. అతనికి కొవిడ్‌ పాజిటివ్‌ అని ఆలస్యంగా తెలిసింది. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత ఆశా వర్కర్ మొబైల్‌కు అతను కరోనా బారినపడినట్లు సమాచారం వచ్చింది.

అంత్యక్రియలకు హాజరైన గ్రామస్థులు ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకంగా దృష్టి సారించిన వైద్యాధికారులు క్యాంప్‌ నిర్వహించి లక్షణాలు ఉన్నవారిని పరీక్షిస్తున్నారు. ఏనుగల్‌లో ఇప్పటికే 20 మందికి పైగా కరోనా పాజిటివ్‌ ఉందని తేలింది. గ్రామస్థులు గృహ నిర్భంధంలోకి వెళ్లిపోగా.. రాకపోకలు బహిష్కరించారు.

ABOUT THE AUTHOR

...view details