తెలంగాణ రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో దారుణం చోటుచేసుకుంది. టీచర్స్ కాలనీకి చెందిన వివాహితపై నిన్న రాత్రి ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు రాహుల్‌గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
తెలంగాణ: జైలుకు పంపిందన్న కక్షతో.. వివాహితపై దాడి - వివాహితపై గొడ్డలితో దాడి
జైలుకు పంపిందన్న కక్షతో యువతిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన... తెలంగాణ రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

వివాహితపై గొడ్డలితో దాడి
వివాహితపై గొడ్డలితో దాడి
గతంలోనే రాహుల్‌పై బాధితురాలు వేధింపుల కేసు పెట్టింది. ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు... రాహుల్‌ను అప్పట్లో జైలుకు పంపారు. ఇటీవలే విడుదలైన రాహుల్‌గౌడ్... జైలుకు పంపిందన్న కక్షతో ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను బీఎన్ రెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: సిద్ధార్థ దేవేందర్ మృతదేహాన్నివెలికితీసిన పోలీసులు