ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అన్నార్తుల అక్షయపాత్ర.. ఈ పుణ్యాల బుట్ట - nek ki roti.. free roti

నాగరికత ఎంత అభివృద్ధి చెందుతున్నా, ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. నేటికీ మూడు పూటలా కడుపు నిండా అన్నం లభించని పేదలు ఎందరో. ఓ హోటల్​ యజమాని చేసిన ఆలోచన ఆకలితో ఉన్న వారి కడుపు నింపుతోంది.

punyala butta
punyala butta

By

Published : Mar 22, 2021, 12:24 PM IST

హైదరాబాద్‌ మహా నగరంలో ఒకవైపు కొంతమంది అర్ధాకలితో అలమటిస్తుండగా మరోవైపు కలిగిన కుటుంబాల్లో ఒక్కొక్కరు ఏడాదికి 50 కిలోలకు పైగా ఆహారాన్ని వృథా చేస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిలో ఉన్నవారి దాతృత్వంతో పేదల ఆకలి తీర్చేందుకు ఓ హోటల్‌ యజమాని చేసిన ఆలోచన నిత్యం పదుల సంఖ్యలో అన్నార్తుల క్షుద్బాధని తీరుస్తోంది.

హైదరాబాద్‌ టోలిచౌకిలో (సెవెన్‌టూంబ్స్‌ దారిలో)ని ‘అబ్దుల్లా నాన్‌ మహల్‌’ నిర్వాహకులు ఇక్బాల్‌ తన హోటల్‌ ముందు ‘నేకీ కి టోక్రీ.. ఫ్రీ రోటీ’ (పుణ్యాల బుట్ట.. ఉచితంగా రొట్టె) పేరుతో ఓ బుట్టని ఏర్పాటు చేశారు. దాతలు ఇందులో వేసే రొట్టెలను ఆయన పేదలకు పంచుతున్నారు. ఇక్కడికి వచ్చే వినియోగదారులు అదనంగా ఆ హోటల్‌లోనే రొట్టెలు కొని వాటిని ఈ బుట్టలో వేసి వెళ్తుండగా.. ఆ రొట్టెలతో రోజుకు వంద మందికి పైగా పేదల ఆకలి తీరుతోందని ఇక్బాల్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details