ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Illegal Affair: గదిలో అతడు, ఆమె... తాళం వేసిన భర్త.. తర్వాతే ఏమైందంటే.. - తెలంగాణ వార్తలు

Illegal Affair: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి దేహశుద్ధి చేశాడు ఆమె భర్త. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్​ పట్టణంలోని భగత్​నగర్​లో జరిగింది. ఇద్దరూ గదిలో ఉండగా తాళం వేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల సమక్షంలో అతడికి దేహశుద్ధి చేశాడు.

Illegal Affair
వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి దేహశుద్ధి

By

Published : Feb 25, 2022, 10:57 PM IST

Illegal Affair: ఓ భర్త.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి దేహశుద్ధి చేశాడు. కరీంనగర్​ జిల్లా సైదాపూర్​ మండలం సోమారం గ్రామానికి చెందిన రాజేశం.. తన భార్యతో కలిసి కరీంనగర్​ పట్టణం భగత్​నగర్​లో ఉంటున్నారు. అతడి భార్య అటవీ శాఖలో సీనియర్​ అసిస్టెంట్​గా పనిచేస్తోంది. అదే కార్యాలయంలో టైపిస్టుగా పనిచేస్తున్న శశిధర్​తో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని రాజేశం ఆరోపిస్తున్నాడు. గత ఆరు నెలలుగా వారి మధ్య సంబంధం ఉందని.. తనని ఇబ్బంది పెడుతుందని.. ఈ విషయమై ఎవరికి ఫిర్యాదు చేసినా ఆధారాలు చూపించమనడంతో ఓ ప్లాన్​ వేశాడు.

గదిలో అతడు, ఆమె... తాళం వేసిన భర్త.. తర్వాతే ఏమైందంటే..

తన భార్య, టైపిస్టు శశిధర్​... ఇంట్లోని ఓకే గదిలో ఉండగా.. గదికి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తాళం తెరిచి చూడగా.. వారిద్దరిని రెడ్​ హాండెడ్​గా పట్టుకున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ.. శశిధర్​కు దేహశుద్ధి చేశాడు. అయితే తనతో మాట్లాడే పని ఉందని ఇంటికి పిలిచి తనపై దాడి చేశాడని శశిధర్​ ఆరోపిస్తున్నాడు. పోలీసులు శశిధర్​ను, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:ఆలస్యంగా వస్తానని చెప్పి వెళ్లాడు... భార్య ఆ పని చేసేసరికి..

ABOUT THE AUTHOR

...view details