నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య ఆయుర్వేదిక్ మందుల పంపిణిపై అనంతపురం జిల్లాకు చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణపట్నంలో కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసిందన్నారు. ఫలితంగా అనేకమంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని తెలిపారు. హౌస్ మోషన్ పిటిషన్‌పై ఇంకా హైకోర్టు నుంచి అనుమతి రాలేదు.
ఆనందయ్య మందులపై హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ - ap high court
ఆనందయ్య ఆయుర్వేదిక్ మందుల పంపిణిపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని పిటిషన్లో తెలిపారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు నుంచి ఇంకా అనుమతి రాలేదు.
anandaiah ayurveda covid medicine