తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలో గ్రనేడ్ కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రం సమీపంలోని ధర్మాపూర్ గ్రామ శివారులో ఉన్న కొండ ప్రాంతంలో గ్రనేడ్ లభ్యమైంది. గ్రామానికి చెందిన ఓ మహిళా పశువులను మేపుతుండగా గ్రనేడ్ కనిపించగా... ఈ విషయాన్ని సర్పంచి దృష్టికి ఆమె తీసుకెళ్లారు. సర్పంచి పోలీసులకు సమాచారం అందించారు.
తెలంగాణ: మహబూబ్నగర్లో గ్రనేడ్ కలకలం... ఎవరు దాచారో.. ? - తెలంగాణ వార్తలు
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో గ్రనేడ్ కలకలం రేపింది. జిల్లా కేంద్రం సమీపంలోని ధర్మాపూర్ గుట్ట ప్రాంతంలో లభ్యమైంది. ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఇది ఎవరికి సంబంధించినదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్నగర్లో గ్రనేడ్ కలకలం.
ఇదే ప్రాంతంలో ఇంకా వేరేచోట మరేమైనా ఉన్నాయా అని మహబూబ్నగర్ గ్రామీణ పోలీసులు గాలిస్తున్నారు. ఈ గ్రనేడ్ మావోయిస్టులకు సంబంధించిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.