F2F with Major Oberoi: 'ఆ కారణంగానే 'అగ్నిపథ్'తో అనేక ఉద్రిక్త పరిస్థితులు' - మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ తాజా సమాచారం
F2f Major Oberoi on Agnipath: 'అగ్నిపథ్' అనేది మంచి పథకమే అయినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం సరిగాలేనందునే గందరగోళానికి దారితీసిందని మాజీ సైనికాధికారి మేజర్ ఎస్.పి.ఎస్ ఒబెరాయ్ పేర్కొన్నారు. సాధారణంగా జరిపే రిక్రూట్‌మెంట్ ర్యాలీల అనంతరం, ఈ పథకం ప్రకటించి ఉంటే ఈ స్థాయిలో ఉద్రిక్తతలకు అవకాశం ఉండేదని కాదని చెప్పారు. అగ్నిపథ్‌తో అనేక సందేహాలు నెలకొన్నాయని.. వాటిపై పూర్తిస్థాయిలో కేంద్ర సర్కార్ స్పష్టతనివ్వాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్‌తో నెలకొన్న గందరగోళం, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై ఒబెరాయ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి నాగేశ్వరాచారి ముఖాముఖి..
ఆ కారణంగానే 'అగ్నిపథ్'తో అనేక ఉద్రిక్త పరిస్థితులు