ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అరేబియా సముద్రంలో మత్స్యకారుడి గల్లంతు - రాష్ట్రానికి చెందిన మత్స్యకారుడు అరేబియా సముద్రంలో గల్లంతు

కర్నాటక రాష్ట్రం మంగళూరు సమీపంలోని అరేబియా సముద్రంలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన మత్స్యకారుడు బర్రి లక్ష్మణ్​​రావు (32) గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

fisherman
fisherman

By

Published : Mar 17, 2020, 12:06 PM IST

రాష్ట్రానికి చెందిన ఓ మత్స్యకారుడు అరేబియా సముద్రంలో గల్లంతయ్యాడు. కర్నాటక రాష్ట్రం మంగళూరు వద్ద సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బర్రి లక్ష్మణ్‌రావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఆదివారం రాత్రి వేట ముగించుకుని.. పడవలోనే నిద్రపోయిన అతడు.. ఉదయానికి కనిపించకుండా పోయాడు. తోటి మత్స్యకారులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మంగళూరు పోలీసులు.. లక్ష్మణ్‌రావు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details