Fire Accident in Wedding Procession: వివాహ వేడుక తర్వాత సంతోషంగా జరుపుకుంటున్న బరాత్.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం టేకులతండాలో ఓ కుటుంబానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సంబరాల్లో భాగంగా టపాసులు పేలుస్తుండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాధితుడు మూడు లక్షల మేర నష్టం వాటిల్లిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.టేకులతండా గ్రామంలో పెళ్లి వేడుక అనంతరం రాత్రి డీజే పాటలతో ఊరేగింపు జరుపుకుంటున్నారు. ఉత్సాహంగా టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకుంటుండగా... రహదారి పక్కన గ్రామానికి చెందిన భూక్య రాములు గుడిసెపై టపాసులు పడి మంటలు అంటుకున్నాయి.
తీవ్ర నష్టాన్ని మిగిల్చిన పెళ్లి బరాత్...నగదు సైతం అగ్నికి ఆహుతి - అగ్ని ప్రమాదం
Fire Accident in Wedding Procession: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ పెళ్లి బరాత్‌లో జరిగిన ప్రమాదం ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటుండగా.. జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు మేకలు, రెండు ద్విచక్ర వాహనాలు, పదివేల రూపాయల నగదు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ప్రమాదంలో నాలుగు మేకలు, రెండు ద్విచక్ర వాహనాలు, పది వేల రూపాయల నగదు, ఇంట్లో సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో నిలువరించడం గ్రామస్థులకు క్లిష్టంగా మారింది. సుమారు మూడు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యులు వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్, ఎంపీటీసీ లక్ష్మయ్య, సర్పంచ్ సునీత పరామర్శించారు. బాధితుడికి జడ్పీటీసీ ప్రవీణ్ తక్షణ సహాయం కింద ఐదు వేల రూపాయలు అందజేశారు.
ఇదీ చదవండి:కీచక అధ్యాపకుడికి దేహశుద్ధి... సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్
గ్రీన్ వ్యాలీ స్కూల్‌లో అగ్నిప్రమాదం... ఏసీలో మంటలు