అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఓ కళాకారుడు ట్రంప్ సూక్ష్మ రూపాన్ని తయారు చేసి తన అభిమానాన్ని చాటాడు. గిర్మాజీపేటకు చెందిన మట్టెవాడ అజయ్ కుమార్ సూది బెజ్జంలో అమెరికా జెండాతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిమను రూపొందించాడు. 1.25 మిల్లీ మీటర్ల ఎత్తు, 0.32 వెడల్పుతో ట్రంప్ సూక్ష్మ రూపాన్ని, 0.94 మిల్లీమీటర్ల పొడవు, 0.64 వెడల్పుతో అమెరికా జాతీయ జెండాను సైతం తీర్చిదిద్దారు. 13 గంటల పాటు శ్రమించి ఈ సూక్ష్మ కళాకృతి రూపొందించినట్లు పేర్కొన్నాడు.
సూది బెజ్జంలో ట్రంప్.. అభిమాని కళారూపం - warangal urban district latest news today
అభిమానానికి హద్దులు లేవు.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై అభిమానంగా తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలో ఓ వ్యక్తి విగ్రహం కట్టి పూజించగా.. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలోని ఓ కళాకారుడు సూది బెజ్జంలో పట్టే ట్రంప్ సూక్ష్మ రూపాన్ని తయారు చేశాడు.
సూది బెజ్జంలో ట్రంప్