Gaddi gudem murder case : కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలను తండ్రే.. బావిలో తోసి చంపిన ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గడ్డిగూడెం తండాకు చెందిన రామ్ కుమార్... పదేళ్ల క్రితం అదే తండాకు చెందిన శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ముంబయిలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అతడు... మూడు రోజుల క్రితం సెలవుపై వచ్చాడు. రామ్‌కుమార్ భార్య... రాత్రి గడ్డిగూడెం తండాలోని పుట్టింటికి వెళ్లింది. ఉదయం పిల్లలను బైక్‌పై పొలం వద్దకు తీసుకెళ్లిన రామ్‌కుమార్... తన పొలంలోని బావిలో ఇద్దరు పిల్లలను తోసేశాడు.
కుమారుడి పుట్టినరోజుకు ఒకరోజు ముందు తండ్రి దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎనిమిదేళ్ల అమీ జాక్సన్, ఆరేళ్ల జానీ బెస్టోల మృతితో తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లల పట్ల ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదని ఆ పిల్లల తల్లి గుండెలవిసేలా విలపిస్తోంది.