Crops Protect With Male And Female Dolls: అడవి జంతువుల బెడదతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కష్టించి పండించిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థలు అన్నీఇన్నీ కావు. చేతికొచ్చిన పంట వన్యప్రాణుల పరం కాకుండా తెలంగాణలోని నిర్మల్ జిల్లా చోండి గ్రామానికి చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించారు. మనుషులను పోలి ఉన్న మగ, ఆడ బొమ్మలతో వాటి బారి నుంచి పంటకు రక్షణ కల్పించుకుంటున్నారు.
పంటను రక్షించుకునేందుకు.. అన్నదాత అదిరిపోయే ఉపాయం - నిర్మల్లో పంటను రక్షించుకోవడానికి రైతు ఆలోచన
Crops Protect With Male And Female Dolls: పంటను కాపాడుకోవడానికి అన్నదాతలు పడే అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు ప్రకృతి నష్టం కలిగిస్తే.. మరోపైపు అడవి జంతువుల నుంచి సైతం ముప్పు తప్పడం లేదు. ఇలాంటి బాధ నుంచి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు అందరికంటే కాస్త విభిన్నంగా ఆలోచించారు. వాటి బెడదకు చెక్ పెట్టేందుకు మనుషులను పోలి ఉన్న మగ, ఆడబొమ్మలను అస్త్రంగా ప్రయోగించి పంటను రక్షించుకుంటున్నారు.

తెలంగాణ ఆదిలాబాద్ కుబీర్ మండలంలోని చోండి గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్ వినూత్న ఆలోచన చేశారు. తనకు ఉన్న 3 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఆ పంటకు అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో పంటను వాటి బారి నుంచి రక్షించుకోవడానికి విభిన్నంగా ఆలోచించారు. దీంతో మనుషుల రూపంలో ఉన్న ఒక ఆడ బొమ్మ, ఒక మగ బొమ్మను తయారు చేసి పంట చేనులో కాపలాగా ఉంచారు. దీంతో పొలంలో మనుషులు ఉన్నారనే ఆలోచనతో అడవి జంతువులు అటువైపు రావడం లేదు. తద్వారా పంటను కాపాడుకుంటున్నానని రైతు లక్ష్మణ్ చెప్పారు. గతంలో పది సంవత్సరాల క్రితం ఈ విధంగానే చేసి పంటను రక్షించుకున్నానని లక్ష్మణ్ పేర్కొన్నారు.