FAMILY SUICIDE: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఓ కుటుంబం చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధ తాళలేక ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆదిభట్ల పరిధిలోని కూర్మల్గూడలో జరిగింది. మృతులు కుద్దుస్ పాషా (37), ఫాతిమా (28), మెహర్ (9), ఫిర్దోషు భేగం(6)గా గుర్తించారు. వీరి కుటుంబం హైదరాబాద్‌లోని సంతోశ్‌నగర్‌లో ఉంటున్నట్లు తెలిపారు.
FAMILY SUICIDE: అప్పుల బాధ తాళలేక... కుటుంబం అంతపని చేసింది
FAMILY SUICIDE: 'కూటి కోసం కోటి విద్యలు' అంటారు పెద్దలు. ఏ పని చేసినా అది జానెడు కడుపు నింపుకోవడానికే మరి. ఎందుకంటే ఆకలికి పరిస్థితులతో దానికి సంబంధం లేదు. ఆ తిండి కోసం చాలా మంది నానవస్థలు పడతారు. అలా కుటుంబాన్ని పోషించడం కోసం అప్పులు చేస్తున్నారు సామాన్యులు. చివరికి ఆ అప్పులు తీర్చే పరిస్థితి లేక ఇచ్చిన వాళ్ల బాధలు భరించలేక తనువు చాలిస్తున్నారు. తాజాగా ఈ అప్పు అనే భూతం నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకుంది. రుణ బాధ భరించలేక పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందంటే..?
అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్య
అయితే రాత్రి పురుగుల మందు తాగి చెరువులో దూకినట్లు ప్రాథమికంగా సమాచారం ఆధారంగా తెలుస్తోంది. తెల్లవారేసరికి తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు చెరువులో తేలాయి. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు చెరువు వద్దకు చేరుకుని నలుగురి మృతదేహాలను వెలికితీశారు. కుద్దుస్ పాషా ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన కుద్దుస్ పాషా తన బామ్మర్ది హమీద్‌ను రాత్రి పదివేల రూపాయలు అడిగాడని చెప్పారు.
ఇవీ చూడండి: