ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

car collided a container: తండ్రిని దుబాయ్​ ఫ్లైటెక్కించి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి - తెలంగాణ నేర వార్తలు

మేడ్చల్ జిల్లా షామీర్​పేట్​ మండలం తుర్కపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్​ను.. కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు(two killed where A car collided container).

car accident
car accident

By

Published : Sep 28, 2021, 2:12 PM IST

దుబాయ్​లో పనికి వెళ్తున్న తండ్రిని ఎయిర్​పోర్టులో దింపి.. కుటుంబ సభ్యులతో కలిసి తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు(two killed in road accident). ఈ ఘటన మేడ్చల్​ జిల్లా షామీర్​పేట్​ మండలం తుర్కపల్లి(accident at turkapally) రాజీవ్​ రహదారిపై జరిగింది(two killed where A car collided container).

జగిత్యాల(jagtial) జిల్లా స్తంభాలపల్లికి చెందిన సుదర్శన్​, అతని పెదనాన్న కుమారుడు రాజేందర్​, మరోవ్యక్తితో కలిసి.. దుబాయ్​లో పనికి వెళ్తున్న సుదర్శన్​ తండ్రిని శంషాబాద్​ విమానాశ్రయంలో దింపేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో మేడ్చల్​ జిల్లా షామీర్​పేట్​ మండలం తుర్కపల్లి సమీపంలో జాతీయ రహదారిపై నిలిపిఉన్న కంటైనర్​ను వీరి కారు వెనుకనుంచి ఢీకొట్టింది(car collided a container) .

ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న రాజేందర్​, పక్కనే ఉన్న సుదర్శన్​ ఘటనాస్థలిలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వంశీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తుర్కపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ఇదీ చూడండి:

cheating with marriage proposal: మ్యాట్రిమోనీలో చూసి వలేశాడు.. ఆ వీడియోలు తీసి ఆన్​లైన్​లో...

ABOUT THE AUTHOR

...view details