Uppal murder case: హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్న నరసింహమూర్తి(70) పై గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు తెల్లవారు జామున మారణాయుధాలతో దాడి చేశారు. అడ్డుకోబోయిన కుమారుడు శ్రీనివాస్‌పై కూడా దుండగులు దాడి చేయడంతో తీవ్రగాయాలతో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు.
Murder: ఉప్పల్‌లో జోతిష్యుడి దారుణ హత్య.. అడ్డుకోబోయిన కొడుకు కూడా.. - ఏపీ క్రైం వార్తలు
Uppal murder case: హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్న తండ్రి, కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఉప్పల్‌లో జోతిష్యుడి దారుణ హత్య
విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఏసీపీ నరేష్ రెడ్డి, సీఐ గోవిందా రెడ్డి ఘటన స్థలికి చేరుకొని హత్యలకు గల కారణాలపై వెలికితీస్తున్నారు. ఆస్తి కోసమే దగ్గరి బంధువులు హత్య చేశారా! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాస్ సింగపూర్ నుంచి నెల రోజుల కిందటే ఉప్పల్‌కు రాగా.. నరసింహమూర్తి జోతిష్యం చెబుతూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: