ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వ్యవసాయ ఉత్పత్తులకూ ఒక బ్రాండ్: కన్నబాబు - Kannababu Latest News

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు ఒక బ్రాండ్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. మార్కాప్ బ్రాండ్​పై వివిధ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయాలని యోచిస్తున్నట్టు వివరించారు. దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి... మార్క్​ఫెడ్ ఆర్థిక సౌజన్యంతో త్వరలోనే మార్కాప్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కన్నబాబు
కన్నబాబు

By

Published : Mar 23, 2021, 9:15 PM IST

వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి మల్టీపర్పస్ ఫెసిలీటీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు... వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. జనతా బజార్ల ఏర్పాటుపై బడ్జెట్, మౌలిక సదుపాయాల కల్పన, నియంత్రణ విధానాలపై ఉన్నతాధికారులతో సమీక్షించినట్టు మంత్రి స్పష్టం చేశారు.

మార్కాప్ ‌- బ్రాండింగ్‌ ద్వారా రైతు ఉత్పత్తులకు అదనపు విలువ వచ్చేలా చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. చిరుధాన్యాలు, మిర్చి, బియ్యం, చింతపండు, రవ్వ, డ్రై ఫ్రూట్స్‌, పచ్చళ్లు, స్థానికంగా తయారు చేసే మిఠాయిలను మార్కాప్ బ్రాండింగ్‌ ద్వారా మార్కెట్‌లోకి ప్రవేశపెడతామని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల ఎంపీఎఫ్‌ సెంటర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్టు కన్నబాబు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details