తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన కొండాపురం హనిమిరెడ్డి(103) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. ఈయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు కాగా.. భార్య పుల్లమ్మ 30 ఏళ్ల కిందట మృతి చెందింది.
తెలంగాణలో ప్రమాదవశాత్తు 103 ఏళ్ల వృద్ధుడు మృతి - 103 ఏళ్ల వృద్ధుడు మృతి వార్తలు
నిత్యం వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆరోగ్యంగా జీవించిన 103 ఏళ్ల ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు కిందపడి.. అనారోగ్యంతో మృతి చెందాడు. వృద్ధుడిని చివరిసారిగా చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
![తెలంగాణలో ప్రమాదవశాత్తు 103 ఏళ్ల వృద్ధుడు మృతి తెలంగాణలో ప్రమాదవశాత్తు 103 ఏళ్ల వృద్ధుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8787087-930-8787087-1599997322618.jpg)
తెలంగాణలో ప్రమాదవశాత్తు 103 ఏళ్ల వృద్ధుడు మృతి
అప్పటి నుంచీ కుమారుల సంరక్షణలోనే వ్యవసాయ పనులు చూసుకుంటూ ఆరోగ్యంగా జీవించిన హనిమిరెడ్డి.. 3 రోజుల క్రితం తన సొంత పనులు చేసుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడ్డారు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. 103 ఏళ్లు ఆరోగ్యంగా జీవించిన హనిమిరెడ్డిని చివరి సారిగా చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
ఇదీ చదవండి