- అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని: హైకోర్టు సీజే
రాజధాని అమరావతి కేసులపై రెండో రోజు విచారణ ముగిసింది. ఈ సందర్భంగా హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని అని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభంజనంలా మహా పాదయాత్ర
ఆంక్షలు, అవరోధాలు దాటుకొని..అపనిందలు, అవహేళనలు పట్టించుకోకుండా...మహా సంకల్పంతో ముందుకు సాగుతున్న అమరావతి రైతుల పోరాటం (Amaravathi Farmers Protest) 700వ రోజుకు చేరింది. ఏకైక రాజధాని సాధన కోసం వారి చేపట్టిన పాదయాత్ర (Amaravathi Farmers Maha Padayatra) 16వ రోజూ దిగ్విజయంగా కొనసాగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మూడు జన్మలెత్తినా.. మూడు రాజధానులు కట్టలేరు..!'
జగన్‌రెడ్డి, ఆయన మంత్రులు మరో మూడు జన్మలెత్తినా.. మూడు రాజధానులు కట్టలేరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 700 రోజులకు చేరిందని.. వారి విజయం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎస్‌ఐపీబీ గ్రీన్ సిగ్నల్.. రాష్ట్రానికి '5' కొత్త కంపెనీలు
రాష్ట్రంలో కొత్తగా 5 పరిశ్రమల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ(State Investment Promotion Board-SIPB) అనుమతించింది. వీటి ద్వారా సుమారు 7,683 కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తెలిపింది. ఈ పరిశ్రమలకు అనువైన భూములను కేటాయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తితిదే 8 వారాల్లో సమాధానమివ్వాలి -సుప్రీం కోర్టు
నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో కార్యక్రమాలు జరగుతున్నాయని సుప్రీంకోర్టులో ఓ భక్తుడు వేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై సీజేఐ ధర్మాసనం విచారణ ముగించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై 8 వారాల్లో సమాధానమివ్వాలని తితిదేను ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్.. ప్రారంభించిన మోదీ
ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్ జిల్లా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను (Purvanchal Expressway) ప్రారంభించారు మోదీ. ఈ క్రమంలో గత పాలకులపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఓ భాగాన్ని మాఫియాకు రాసిచ్చేశారని (PM Modi news) విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బైడెన్‌కు జిన్‌పింగ్ డైరెక్ట్ వార్నింగ్
తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అమెరికా (US China latest news) ప్రోత్సహించడాన్ని వ్యతిరేకిస్తూ అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ను నేరుగా హెచ్చరించారు (Biden XI meeting) చైనా అధినేత జిన్‌పింగ్. నిప్పుతో చెలగాటమాడుతున్నారని, అలా చేసే వారంతా భస్మమైపోతారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారీగా తగ్గిన పసిడి ధర..
బంగారం (Gold Price today), వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే.. మంగళవారం భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.540 తగ్గింది. కిలో వెండి ధర ఏకంగా రూ.560 క్షీణించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వచ్చే పదేళ్లలో భారత్‌లో 3 ఐసీసీ టోర్నమెంట్లు
వచ్చే పదేళ్లలో భారత్‌లో మూడు ఐసీసీ టోర్నమెంట్లు జరగనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి.. రాబోయే దశాబ్ద కాలానికి సంబంధించిన 8 కొత్త టోర్నీల వివరాలను ప్రకటించింది. వాటికి 12 దేశాలు అతిథ్యమివ్వనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పవర్‌స్టార్ పునీత్‌కు రాష్ట్ర అత్యున్నత పురస్కారం- పద్మశ్రీ కూడా!
గుండెపోటుతో ఇటీవలే తుదిశ్వాస విడిచిన కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన 'కర్ణాటక రత్న'ను ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు@9PM