- రాష్ట్రంలో కొత్తగా 5,145 కరోనా కేసులు, 31 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 5,145 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 31 మంది మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వైరస్ కేసులు 7,44,864కు చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలి: సీఎం
రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీతో పాటు అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలని స్పష్టం చేశారు. హోం ఐసోలేషన్లో ఉన్నవారికి మెడికల్ కిట్లు అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఏపీ రిలీవ్ చేసినా తెలంగాణ చేర్చుకోలేదు'
తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఏపీ సంస్థలు రిలీవ్ చేసినా తెలంగాణ సంస్థలు చేర్చుకోలేదని ఉద్యోగుల పిటిషన్ వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ ఎన్నికలు నిర్వహించలేమని హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా వ్యాధి తీవ్రత దృష్ట్యా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై మీ వివరణ ఏంటో చెప్పాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆధార్ తరహాలో ప్రాపర్టీ కార్డులు
గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించేందుకు తీసుకొచ్చిన స్వామిత్వ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రాపర్టీ కార్డులను ఆదివారం అందజేయనున్నారు. ఆరు రాష్ట్రాల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాసవాన్ మృతితో బిహార్ ఎన్నికలపై భారీ ప్రభావం!