- విద్యుత్ ఛార్జీల మోతపై.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనల వెల్లువ
కరెంట్ ఛార్జీల పెంపుపై విపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఛార్జీల మోతను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా భారీఎత్తున ర్యాలీలతో కదం తొక్కారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు : సీఎం జగన్
భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. "జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష" పథకంపై ఆయన సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గజదొంగలే ఆశ్చర్యపోయేలా జగన్ దోపిడీ: చంద్రబాబు
రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని జగన్ రెడ్డి తన వ్యక్తిగత అజెండాతో సర్వనాశం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల పెంపుతో.. ఇళ్లల్లో స్విచ్ వేయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు తెచ్చారని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కానీ
కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. అయితే.. వెంటనే ఐఏఎస్‌లు క్షమాపణ కోరడంతో జైలుశిక్ష తప్పించి.. సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 72మంది ఎంపీలకు మోదీ వీడ్కోలు..
రాజ్యసభలో పదవీకాలం పూర్తయిన 72మంది ఎంపీలకు వీడ్కోలు పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. వీరంతా మళ్లీ సభకు తిరిగిరావాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ రాష్ట్రాల్లో కేంద్ర బలగాల పరిధి కుదింపు
ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం పరిధిపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇమ్రాన్‌కు కాస్త ఊరట.. 'అవిశ్వాసం'పై చర్చ మళ్లీ వాయిదా
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఊరట లభించింది. అవిశ్వాస తీర్మానంపై చర్చపై విపక్షాలు పట్టుబట్టగా.. జాతీయ అసెంబ్లీని ఏప్రిల్ 3కు వాయిదా వేశారు స్పీకర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?
కొద్ది రోజులుగా పడిపోయిన బంగారం ధర గురువారం కాస్త పెరిగింది. అటు వెండి ధర మాత్రం మరింత తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల మేలిమి పుత్తడి రూ.53,060గా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పొవార్ స్థానంలో లక్ష్మణ్!.. అమ్మాయిల రాత మారేనా?
మహిళా జట్టుకు ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న రమేశ్ పొవార్ కాంట్రాక్ట్ ముగిసింది. దీంతో, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్న మాజీ క్రికెటర్ లక్ష్మణ్.. మహిళా జట్టుకు అవసరమైన మెరుగులు దిద్దేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రాజమౌళిపై అలక'... ఆలియా భట్ స్పందన ఇదే..
ఆర్ఆర్ఆర్ సినిమాలో తన పాత్ర నిడివిపై అసంతృప్తితో ఉన్నట్లు వచ్చిన వార్తలను ఆలియా భట్ ఖండించారు. రాజమౌళి దర్శకత్వంలో పనిచేయడం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి వదంతులను ప్రచారం చెయ్యొద్దని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీ ప్రధాన వార్తలు @9PM