ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

9pm Top news
ప్రధాన వార్తలు @9PM

By

Published : Mar 29, 2022, 8:59 PM IST

  • అట్టహాసంగా తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు
    తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా కార్యకర్తలు, నేతలు, అభిమానులకు.. పార్టీ అధినేత చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం.. రాజకీయ అనివార్యమన్నారు. ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గడువులోగా ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలి: సీఎం జగన్
    సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జలవనరులశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఎన్టీఆర్​కు భారతరత్న ఇవ్వాలి'.. లోక్​సభలో ఎంపీ జయదేవ్
    స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ లోక్​సభలో డిమాండ్ చేశారు. తెలుగుదేశం 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని సభలో ప్రస్తావించిన ఆయన.. తెలుగు ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అఖిల భారత సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల ఆందోళనలు
    అఖిల భారత సమ్మెకు మద్దతుగా రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని నినదించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విపక్షాల ఐక్యతకు దీదీ పిలుపు.. ఆ పార్టీలకు లేఖ
    కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగాల్ సీఎం మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో మరోసారి గళమెత్తారు. విపక్షాలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. అభ్యుదయ శక్తులన్నీ ఒక వేదికపై సమావేశమై.. ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సరిహద్దు రగడ.. రెండు రాష్ట్రాల చారిత్రక ఒప్పందం
    దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే దిశగా.. అసోం, మేఘాలయ ముందడుగు వేశాయి. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చర్చలు సక్సెస్.. కీవ్​ నుంచి రష్యా వాపస్.. యుద్ధం ముగిసినట్టేనా?
    రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని సహా కీలక నగరాల్లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వరుసగా రెండో సెషన్​లో లాభాలు.. సెన్సెక్స్​ 350 ప్లస్​
    అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, హెవీవెయిట్​ షేర్ల ఊతంతో.. స్టాక్​ మార్కెట్లు మళ్లీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 350, నిఫ్టీ 103 పాయింట్ల మేర పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ర్యాంకింగ్​లో అదరగొట్టిన మిథాలీ, గోస్వామి
    ఐసీసీ మహిళల ర్యాంకింగ్​లో భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సత్తా చాటింది. బ్యాటర్ల జాబితాలో ఆరోస్థానంలోకి దూసుకొచ్చింది. ఓపెనర్ మంధాన పదో ర్యాంకును పదిలం చేసుకుంది. బౌలర్ల జాబితాలో ఝులన్ గోస్వామి ఐదో ర్యాంకులో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే
    ఈ వారం కూడా పలు సినిమాలు(ott movies releasing this week).. ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ అవేంటి? ఎందులో రిలీజ్​ కానున్నాయి? అనేది తెలుసుకోవాలంటే ఈస్టోరీ చదివేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details