- దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సీఎం జగన్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈనెల 14 నుంచి గెజిట్ అమల్లోకి
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తున్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరిట పాదయాత్ర
గుంటూరు జిల్లా తుళ్లూరులోని హెచ్‌ఎస్‌ఆర్(HRS) కల్యాణ మండపంలో.. అమరావతి ఐకాస నేతలు సమావేశమయ్యారు. అమరావతి ఉద్యమాన్ని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బీసీలు ఏకం కావాలి: పవన్ కల్యాణ్
బీసీ ఉద్యమానికి మద్దతుగా తన వంతుగా ప్రతి వేదిక మీద మాట్లాడుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan on bc movement news) అన్నారు. ఉద్యమించే సమయంలో బీసీలు ఒకటిగానే ఉంటున్నా.. ఎన్నికల సమయానికి మాత్రం విడిపోతున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో విద్యుత్ సంక్షోభం రాకుండా కేంద్రం చర్యలు
దేశంలో బొగ్గు కొరత కారణంగా(coal shortage in india) విద్యుత్ సంక్షోభం ఏర్పడే ప్రమాదముందని భయాందోళనలు నెలకొన్న తరుణంలో కేంద్రం కీలక సూచనలు చేసింది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు సాయం చేయాలని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దెబ్బకు దెబ్బ- ఏడుగురు ముష్కరులు హతం
ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్లు, పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సోమవారం నుంచి జరిపిన దాడుల్లో ఏడుగురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమెరికాకు కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్..
అజేయమైన సైన్యాన్ని నిర్మిస్తానని.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim news today) ప్రతిజ్ఞ చేశారు. ఆత్మరక్షణ కోసం ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని స్పష్టం చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలకు అమెరికానే కారణం అని ఆరోపించారు కిమ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్టాక్ మార్కెట్లకు లాభాలు- కొత్త గరిష్ఠానికి నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు (Stock Market) మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 149 పాయింట్లు పెరిగి 60,284 వద్దకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 46 పాయింట్ల లాభంతో 18 వేల మార్క్‌కు చేరువైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వేతనం లేకుండానే ధోనీ సేవలు
ఎమ్ఎస్ ధోనీ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఎలాంటి గౌరవ వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు మార్గదర్శకునిగా పనిచేయనున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మా' ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామా
'మా' ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు