- దాడులు చేస్తే తప్ప వ్యవహారం తెలియలేదా?: సీఎం
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పందించారు. అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా?.. అసలు నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఇంత పెద్ద స్థాయిలో తప్పులు జరిగినా ఎందుకు తెలియలేదని నిలదీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భాజపా శ్రేణులను వేధిస్తోంది: కిషన్‌రెడ్డి
విజయవాడలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుందని స్పష్టం చేశారు. కేంద్ర పథకాలు మినహా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని ఆయన ఆక్షేపించారు. ఆర్టికల్ 370 అనేది జిన్నా తీసుకువచ్చిన రాజ్యాంగమని.. అందుకే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్..
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. అనుబంధ కమిటీల నియామకం, జిల్లాలో స్థానిక నేతల తీరుపై కొంత కాలంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో ఉన్నారు. అనుబంధ కమిటీల్లో నియామకానికి సంబంధించి ఇటీవల గోరంట్ల సిఫారసు చేసిన పేర్లకు అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వలేదనే చర్చ ఆయన్ను మరింత కలత చెందేలా చేసిందని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హత్యగా ప్రాథమిక నిర్ధారణ..
విజయవాడలో కలకలం రేపిన కారులో రాహుల్ మృతదేహం కేసును పోలీసులు హత్యగా నిర్ధారించారు. వ్యాపార, ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. కారులోని తాడు, దిండు, నీటి సీసాలపై ఉన్న వేలిముద్రలను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. రాహుల్ మెడ కమిలిపోయి ఉండటం గమనించిన పోలీసులు.. ఇది హత్యేనని నిర్ధారణకు వచ్చారు. మృతుని బంధువులు కూడా మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రపతికి శస్త్రచికిత్స
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు గురువారం ఉదయం కంటి ఆపరేషన్ (క్యాటరాక్ట్ సర్జరీ) జరిగింది. ఈ మేరకు శస్త్రచికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదలచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'గాలి'కి సుప్రీం అనుమతి