- దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్
మాజీ మంత్రి దేవినేని ఉమకు కృష్ణా జిల్లా మైలవరం జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దేవినేనిని రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ జంక్షన్ నుంచి జూమ్ ద్వారా జడ్జి ఎదుట దేవినేనిని పోలీసులు హాజరుపరిచారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Tdp Leaders House Arrest: తెదేపా నేతల గృహ నిర్భంధం
దేవినేని ఉమను పరామర్శించేందుకు వెళ్తుండగా... కృష్ణా జిల్లా తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు నిర్భంధించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గృహ నిర్బంధంలోనే ఉండాలని ఆదేశించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- srisailam dam: పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు అధికారులు జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తనున్న సమాచారం తెలుసుకున్న పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CM JAGAN CASES: ఇండియా సిమెంట్స్ కేసులోనూ వాదనలకు సిద్ధం కావాలి: కోర్టు
హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ ఛార్జ్‌షీట్లపై విచారణ ఆగస్టు 6కు వాయిదా పడింది. ఇండియా సిమెంట్స్ కేసులోనూ వాదనలకు సిద్ధం కావాలని కోర్టు ఆదేశించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్కు మరోమారు అమెరికా భారీ సాయం
కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో భారత్కు మరోసారి సాయం ప్రకటించింది అమెరికా. 25 మిలియన్ డాలర్లను అందించనున్నట్లు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెగసస్పై ఆగని రగడ- దద్దరిల్లిన పార్లమెంట్