ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - Top Ten News @ 9 PM

.

టాప్​టెన్​ న్యూస్ @ 9PM
టాప్​టెన్​ న్యూస్ @ 9PM

By

Published : Sep 24, 2020, 9:01 PM IST

1 . ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమం

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనా తగ్గినా ఇతర అనారోగ్య సమస్యల వల్ల ఆయన పరిస్థితి విషమించిందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ప్రకటించింది. 50 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ ద్వారా చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై కమల్​హాసన్

ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలును కోలీవుడ్​ హీరో కమల్​హాసన్ సందర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ, విషమంగా ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. మళ్లీ పెరిగిన కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,855 కరోనా పాజిటివ్​ కేసులు, 52 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,54,385కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. పట్టాలపై చిన్నారి.. లోకోపైలట్​ చాకచక్యంతో సేఫ్ ​

ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని బల్లభగఢ్​ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బాలుడు.. రెండేళ్ల వయసున్న తన తమ్ముడిని కదిలే రైలు ముందుకు నెట్టేశాడు. ఇది చూసిన లోకో​పైలట్​ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. రైతు బిల్లులపై కాంగ్రెస్​ దేశవ్యాప్త ఆందోళనలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్​ పార్టీ. సంబంధిత కార్యాచరణను ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. ఎన్నికల విధుల నుంచి బీఎస్​ఎఫ్​ బలగాల ఉపసంహరణ!

పొరుగు దేశాలతో సమస్యలు ఉత్పన్నమవుతున్న క్రమంలో సరిహద్దుల్లో భద్రతను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. బీఎస్​ఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​పీలపై భారాన్ని తగ్గించేందుకు అంతర్గత విధుల నుంచి క్రమంగా ఉపసంహరించుకోనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. కశ్మీర్​లో ఉగ్రఘాతుకం- ఈసారి న్యాయవాదిని..

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో రెండో హత్య చేశారు. ఇవాళ సాయంత్రం 6.25 గంటల ప్రాంతంలో న్యాయవాది బాబర్​ ఖాద్రీపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ఇజ్రాయెల్​లో మళ్లీ లాక్​డౌన్- సింగపూర్​లో సడలింపు​

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇజ్రాయెల్​ రెండోసారి లాక్​డౌన్​ విధించనుంది. స్విట్జర్లాండ్​లో 2500 మంది విద్యార్థులను నిర్బంధంలోకి వెళ్లాలని ఆ దేశ వైద్యాధికారుల ఆదేశించారు. సింగపూర్ మాత్రం​ లాక్​డౌన్​ ఆంక్షలను సడలిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. భారత మార్కెట్​పై హార్లీ డేవిడ్​సన్​ కీలక నిర్ణయం

భారత్​లో ప్రస్తుత బిజినెస్ మోడల్​ నుంచి తప్పుకుంటున్నట్లు లగ్జరీ బైక్​ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్​సన్​ గురువారం అధికారికంగా ప్రకటన చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. బెంగళూరు-పంజాబ్ మ్యాచ్​లో డీన్ జోన్స్​కు నివాళి

బెంగళూరు-పంజాబ్ మ్యాచ్​లో డీన్ జోన్స్​కు నివాళిగా క్రికెటర్లందరూ చేతికి నల్లబ్యాండ్​లు ధరించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలకమండలి అధికారి చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details