- గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుంది: సీఎం జగన్
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో 81వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు పచ్చజెండా ఊపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. ఈ రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని రైతులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ పేరొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కళ తప్పిన.. వైఎస్ఆర్ జలకళ!
బోరు వేసుకుంటే తప్ప నీటి సదుపాయం లేని చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలుస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పింది. నాలుగేళ్లలో 2 లక్షల బోర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అయితే ప్రభుత్వం 2021-22 వరకు తవ్విన మొత్తం బోర్లు 6,555. వాటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి అయ్యే వ్యయాన్ని డిస్కంలు ప్రతిపాదిస్తే అంత మొత్తం భరించడం సాధ్యం కాదంటూ ఒక్కొక్క రైతుకు రూ.2 లక్షలనే ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నెల్లూరు జిల్లాలో దారుణం.. బాలికపై మేనమామ యాసిడ్ దాడి
మేనమామ అంటే.. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన వాడు. భవిష్యత్‌కు దారి చూపాల్సిన వాడు. కానీ కామం మత్తులో మేనకోడలిపైనే కన్నేశాడు. గత కొన్ని రోజులుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది ఎవరికీ చెప్పుకోలేక ఆమె కుమిలిపోయింది. దాంతో అతని ఆగడాలు ఎక్కువయ్యాయి. ఈరోజు అది శృతిమించి.. ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు కోశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖలో డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ సరఫరా కొనసాగుతూనే ఉంది. పట్టణం నుంచి పల్లె వరకు డ్రగ్స్ సప్లై చేసి.. యువతను మత్తుకు బానిసలను చేసి కోట్లు గడిస్తున్నారు. ఇలాంటి వాళ్ల ఆట కట్టించేందుకు పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఏదో ఒకచోట మత్తుమందులు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు సంపాదించిన మహిళ
కంటి నిండా నిద్ర పోవడం వల్ల రూ.5 లక్షలు సంపాదించింది ఓ మహిళ. బంగాల్‌కు చెందిన త్రిపర్ణా చక్రవర్తి.. భారత తొలి స్లీప్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను దక్కించుకుంది. అసలు నిద్రపోవడం వల్ల ఎందుకు ఇంత డబ్బులు వచ్చాయి? అన్ని డబ్బులు ఎవరు ఇచ్చారు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బడిలో మత స్వేచ్ఛ ఉంటుందా?'.. హిజాబ్ కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న