ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ap topnews ప్రధానవార్తలు9am

.

9am topnews
ప్రధానవార్తలు9am

By

Published : Aug 29, 2022, 8:58 AM IST

  • Polavaram project అగమ్యగోచరం

రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పోలవరంపై ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఘనమైన ప్రకటనలు చేసిన జగన్‌ ఇప్పుడేమో కేంద్రమే చేయాలంటూ బేల మాటలు మాట్లాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమంటూ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పదేపదే చెబుతుండటం. మరింత కలవరపెడుతోంది.

  • రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, అపహరణలూ ఎక్కువే

రాష్ట్రంలో వైకాపా హయాంలో దళితులు, గిరిజనులపై నేరాలు గణనీయంగా పెరిగాయి. హత్యలు, అత్యాచారాలు, అపహరణలు అధికమయ్యాయి. మహిళలు, చిన్నారులపై అకృత్యాలు, అత్యంత హింసాత్మక నేర ఘటనలూ ఎక్కువయ్యాయి. ఐపీసీలోని సెక్షన్ల కింద నమోదైన కేసుల్ని పరిగణనలోకి తీసుకుంటే జాతీయ స్థాయి కంటే ఏపీలోనే నేరాల రేటు అధికంగా ఉంది.

  • ఆగని అన్నదాత ఆత్మఘోష, దేశంలో మూడో స్థానం

రాష్ట్రంలో అన్నదాత ఆత్మఘోష నానాటికి పెరిగిపోతోంది. గత ఏడాదితో పోల్చుకుంచే రాష్ట్రంలో 19.79% రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ప్రమాద మరణాలు ఆత్మహత్యల సమాచార నివేదిక 2021 వెల్లడించింది. దేశంలో మూడో స్థానంలో ఉందని పేర్కొంది. భూమి ఉన్న రైతులే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు పెర్కొంది.

  • సొంత నేలపైనే అస్తిత్వ పోరాటం

తెలుగు. అమ్మ నేర్పిన ఆది భాష. 56 అక్షరాల అందమైన పూదోట. సుందర తెలుంగునిల్‌ పాట సెయిత్తు అంటూ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతీయార్‌ పులకించినా. పాడనా తెలుగు పాట అంటూ దేవులపల్లి కీర్తించినా. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణదేవరాయలు తన్మయం పొందినా. అది తెలుగు భాష తియ్యందనాల గొప్పదనమే. ఇలాంటి భాషకు సొంతగడ్డపైనే అన్యాయం జరుగుతోంది.

  • నదిలో ట్రాక్టర్ బోల్తా​, 8 మంది రైతులు మృతి

ప్రమాదవశాత్తు ట్రాక్టర్​ బోల్తాపడి 8 మంది రైతులు మృతిచెందారు. మరో 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన యూపీలోని హర్దోయీ జిల్లాలో జరిగింది.

  • తొమ్మిదేళ్ల నిర్మాణం, 9సెకన్లలో స్మాష్, నష్టం ఎంతో తెలుసా

నోయిడాలో జంట టవర్ల కూల్చివేత వంద శాతం విజయవంతమైందని ఈ ప్రక్రియ చేపట్టిన 'ఎడిఫిస్‌ ఇంజినీరింగ్‌' సంస్థ తెలిపింది. ఆదివారం సరిగ్గా మధ్యాహ్నం 2:30 గంటలకు వాటిని కూల్చివేశారు. అంతకుముందే స్థానికులందరినీ అక్కడి నుంచి తరలించారు. ఈ జంట భవనాల కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు.

  • జాబిలిపైకి మలి యాత్రలో తొలి అడుగు, మానవరహిత ఆర్టెమిస్‌ 1 ప్రయోగం నేడే

50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమంలో తొలి అడుగు పడనుంది. అంతరిక్షంలో సుదూర ప్రాంతాల దిశగా మానవులకు బాటలు వేయనుంది. ఆర్టెమిస్‌-1 పేరుతో నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లనున్నాయి.

  • వినోదాల మైదానంలో ఓటీటీ ఆట, 50కోట్లకు సబ్​స్కైబర్ల సంఖ్య

నెలకు 5 గంటలకు పైగా ఓటీటీలను 50 శాతం మందికి పైగా వినియోగిస్తుండడంతో సినిమా థియేటర్‌ లాభాలను ఓటీటీలు తినేస్తున్నాయి. ప్రధాన స్టూడియోలు, నిర్మాణ సంస్థలు కూడా ఈ స్ట్రీమింగ్‌ సిరీస్‌లకున్న గిరాకీని గమనించాయి.

  • హార్దిక్​ ఆల్​రౌండ్​ షో, కోహ్లీది మళ్లీ అదే కథ

ఆసియా కప్‌ 2022లో భారత్ జట్టు బోణీ అదిరిపోయింది. పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్​ను సిక్స్‌తో హార్దిక్ పాండ్య గెలుపుగా ముగించేశాడు. ఆఖరి ఓవర్‌ను పాక్​ స్పిన్నర్ వేయబోతున్నాడని ముందే పసిగట్టిన హార్దిక్ హిట్టింగ్ కోసం రెడీ అయిపోయి అదరగొట్టేశాడు.

  • ఎందుకీ తడబాటు, కథలపై యువ హీరోల గురి తప్పుతోందా

తెలుగు సినిమాకు మహారాజ పోషకులు యువతరమే. బాక్సాఫీసు దగ్గర తెగే తొలి టికెట్‌ వాళ్లదే. ఆ తర్వాత బయటికొచ్చే టాక్‌ ఆధారంగానే మిగతా ప్రేక్షకులు తోడవుతుంటారు. యువతరానికి ఎలాంటి కథలు నచ్చుతాయో వాళ్ల అభిరుచులు ఎలా మారుతుంటాయో యువ కథానాయకులకి మంచి అవగాహన ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details