ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ap topnews ప్రధానవార్తలు9am

.

ap topnews
ప్రధానవార్తలు9am

By

Published : Aug 24, 2022, 8:57 AM IST

  • డీఏపీకి కటకట, బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకు అదనపు వసూలు

రాష్ట్రంలో డీఏపీ కొరత అన్నదాతలను వేధిస్తోంది. బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకు అదనపు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సహకార సంఘాలకు సరఫరాలో ప్రభుత్వం కోత పెట్టింది. ఆర్‌బీకేల్లోనూ అరకొర నిల్వల, రాజకీయ ఒత్తిళ్లు వెలుగు చూస్తున్నాయి. దుకాణాల్లో ఇతర ఉత్పత్తులు కొనాలనే షరతులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తమ డైరెక్టర్‌కు రాజకీయ నేపథ్యం ఉన్న విషయం తెలియదన్న ఎర్తిన్‌ ఎండీ

దివాలా ప్రక్రియ ద్వారా ఇందూ ప్రాజెక్ట్స్‌ను సొంతం చేసుకుంటున్న ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌లో ఇటీవల పెట్టుబడి పెట్టినవారి తరఫున ఈ ఏడాది ఏప్రిల్‌లో అయిదుగురు కంపెనీ డైరెక్టర్లుగా చేరారని, వారిలో ఒకరికి రాజకీయ సంబంధాలు ఉన్నాయనే విషయం తమకు తెలియదని ఎర్తిన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.రవిమోహన్‌ చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మితిమీరుతున్న రికవరీ ఏజెంట్ల ఆగడాలు, లోన్​ కట్టలేదని ఏం చేశారంటే

రికవరీ ఏంజెట్ల వేధింపులు నానాటికీ ఎక్కువవుతున్నాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనానికి వచ్చిన ఓ వాహనదారుడిని ఇబ్బందులకు గురి చేశారు. ఫైనాన్స్​లో కొన్న వాహనానికి కిస్తీలు చెల్లించలేదని వెహికల్​ను స్వాధీనం చేసుకున్నారు. తాము దైవదర్శనానికి వచ్చామని చెప్పినా వినకుండా కర్కషంగా వ్యవహరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన సీఎం ఏం చేస్తున్నారన్న తెదేపా నేతలు

ప్రభుత్వ ఆస్తులను కాపాడలేరా అంటూ ముఖ్యమంత్రి జగన్​ను తెదేపా నేతలు ప్రశ్నించారు. లేపాక్షి నాలెడ్జి హబ్ పేరిట అడ్డగోలుగా దోచేసిన జే-గ్యాంగ్ ఇప్పుడు ఇందూ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియను అడ్డు పెట్టుకుని భారీ లూటీకి తెగబడిందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోవట్లేదని గడ్కరీ విమర్శలు

ఇటీవల భాజపా పార్లమెంటరీ కమిటీలో చోటు కోల్పోయిన కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేశారు. ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే అతి పెద్ద సమస్య అన్నారు. ఈ వ్యాఖ్యలపై కొందరు భాజపా నేతలు కూడా స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రభుత్వానికి దంపతులను విడదీసే అధికారం లేదు

చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న జంటను విడదీయకూడదని, ప్రభుత్వానికి వారి వ్యక్తిగత జీవితాల్లో చొరబడే అధికారం లేదని దిల్లీ హైకోర్టు పేర్కొంది. బిహార్‌లో ఇల్లు వదలి తమ మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకున్న ముస్లిం యువకుడు, ముస్లిం బాలిక కేసులో ఈ నెల 17న ఈ మేరకు తీర్పు ఇచ్చింది. వధువు ప్రస్తుతం గర్భవతి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​, బ్రిటన్​ సంబంధాలపై రిషి సునాక్​ కీలక వ్యాఖ్యలు

బ్రిటన్​ ప్రధాని రేసులో ఉన్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్​ ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​, బ్రిటన్​ సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా మార్చాలని అనుకుంటున్నట్లు చెప్పారు. భారతీయ బ్రిటిష్​ సభ్యులతో లండన్​లో నిర్వహించిన సమావేశంలో ఇలా మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అప్పుల ఊబిలో అదానీ గ్రూప్​, పరిస్థితులు మారితే కూరుకుపోయే ప్రమాదం

భారత కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ క్రమంగా అప్పుల కూపంలోకి జారుకుంటోందని ఫిచ్‌ గ్రూప్‌ సంస్థ క్రెడిట్‌సైట్స్‌ హెచ్చరించింది. ప్రస్తుత వ్యాపారాల విస్తరణతోపాటు కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్‌ భారీగా అప్పులు చేస్తోందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లెజెండ్స్ లీగ్‌ క్రికెట్‌ సీజన్​ 2 షెడ్యూల్​ రిలీజ్​, వేదికలు ఇవే

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ క్రికెటర్ల కోసం నిర్వహించే లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్ఎల్‌సీ) టోర్నమెంట్‌ రెండో ఎడిషన్‌ సిద్ధమైంది. ఆరు నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఇండియన్ మహారాజ్‌, వరల్డ్‌ జెయింట్స్‌ జట్ల మధ్య ప్రత్యేక మ్యాచ్‌ జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాఘవేంద్రరావు పేరు వెనుక బీఏ ఎందుకో తెలుసా

ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకేంద్రుడిగా కీర్తిని గడించిన వ్యక్తి రాఘవేంద్రరావు. ఆయన చిత్రాల్లో ప్రతీ ఫ్రేమ్‌లోనూ భారీదనం కనపడుతుంది. అంతకుమించి కథానాయికలను అందంగా చూపించడంలో ఆయనకు సాటి మరెవ్వరూ లేరు. ఏకంగా 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు ప్రతి చిత్రంలో టైటిల్స్‌లో తన పేరు చివరిన బి.ఎ.అని వేసుకుంటారు. అలా ఎందుకు వేస్తారో ఆయన మాటల్లోనే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details