- కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టుల నిర్మాణం
రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. నిధులు కేటాయించక, నిర్మాణ పనులు జరక్క నత్తతో పోటీపడుతున్నాయి. మూడేళ్ల క్రితం ప్రాధాన్యత క్రమంలో ప్రకటించిన 42 ప్రాజెక్టుల్లో కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రాధాన్య జాబితాలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులను చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇంట్లోకి వెళ్లకముందే వడ్డీ మోత
టిడ్కో గృహాల విషయంలో ప్రభుత్వ జాప్యం లబ్ధిదారులకు పెనుభారంగా మారుతోంది. లబ్ధిదారుల పేరుతో బ్యాంకులు అందించిన రుణంపై వడ్డీ కొండలా పేరుకుపోతోంది. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం రెండేళ్ల గడువు తీరకుండానే వడ్డీ కట్టాలని లబ్ధిదారులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇటు అద్దె, అటు వడ్డీ రెండూ చెల్లించలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యాప్ డౌన్లోడ్ చేసుకోబోమంటూ ఉపాధ్యాయుల లేఖల సమర్పణ
రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఆధారిత హాజరు నమోదుపై ఉపాధ్యాయులు సహాయ నిరాకరణ ప్రకటించారు. యాప్ డౌన్లోడ్ చేసుకోబోమంటూ అనేక మంది ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. ప్రభుత్వం డివైజ్, డేటా అందిస్తేనే హాజరు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వం అన్ని విధాలుగా పరిశ్రమలను ప్రోత్సహిస్తోందన్న సీఎం జగన్
ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించినప్పుడే పేదరికం నుంచి బయటపడటంతో పాటు.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా పరిశ్రమలను ప్రోత్సహిస్తోందన్నారు. మూతపడిన ఎంఎస్ఎంఈలకు చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు, ఏం జరిగింది
ఒకే ఇంట్లో ఆరుగురు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. జమ్మూలోని సిధ్రా ప్రాంతంలోని బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను జమ్మూ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఘోర రైలు ప్రమాదం, 53 మందికి గాయాలు