- అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు
అనకాపల్లి జిల్లాలో అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జిల్లాలోని ఓ సెజ్‌లో కమిషన్ల విషయంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అనుచరుల మధ్య వర్గ పోరు నడుస్తోంది. పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయం కోసం రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ గొడవలు తీర్చలేక కంపెనీ ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాఠశాలల్లో పుస్తకాల కొరత రానీయొద్దన్న ముఖ్యమంత్రి జగన్
విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న విద్యా కానుక, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదుల డిజిటలైజేషన్, స్మార్ట్ టీవీ లేదా ఇంటరాక్టివ్ టీవీ ఏర్పాటు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏప్రిల్‌లో అందించే జగనన్న విద్యా కానుక పంపిణీకి ఇప్పటినుంచే అన్నిరకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఎక్కడా పుస్తకాల కొరత రానీయొద్దని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జిల్లా కార్యాలయాల్లో సౌకర్యాలు కరవు
రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగు నెలలు గడిచినా కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాల్లో అవసరాలకు తగ్గట్లు ఉద్యోగుల్లేక పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. సీనియర్ అధికారులు లేనిచోట జిల్లాల కలెక్టర్లు, జేసీలపై పనిభారం పెరుగుతోంది. ప్రముఖుల పర్యటనలతో ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే విశాఖ, ఎన్టీఆర్, తిరుపతి తదితర జిల్లాల్లో ప్రొటోకాల్ విధులకు సరిపడా అధికారులు లేరు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
సీనియర్ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్‌ని ప్రభుత్వం... నాలుగు నెలల వ్యవధిలోనే రెండు సార్లు బదిలీ చేసింది. భాస్కర్ తో మరో నలుగురు ఐఏఎస్ లకూ స్థానచలనాలు జరిగాయి. కాటమనేని భాస్కర్ ఈ ఏడాది ఏప్రిల్ 4న రవాణాశాఖ కమిషర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రజాప్రతినిధుల సిఫార్సులకు తలొగ్గకపోవడంతో... జూన్ 28న రాత్రి బదిలీ వేటుకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పరిఢవిల్లిన పరిశోధన.. భవిష్యత్ టెక్నాలజీల దిశగా భారత్ పరుగులు
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో మైలురాళ్లను సాధించిన భారత్.. జన జీవితాల్లో విజ్ఞానపు వెలుగులు విరజిమ్ముతోంది. భవిష్యత్ టెక్నాలజీల దిశగా భారత్ పరుగులు పెడుతోంది. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రానున్న 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై ప్రత్యేక కథనం..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫుల్‌గా మందు కొట్టిన హెడ్ మాస్టర్.. తూలుతూ పాఠశాలకు..