- గోదావరికి మళ్లీ పోటెత్తిన వరద
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదికి వరద మళ్లీ పోటెత్తింది. వరద నేపథ్యంలో దవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటగంటకు వరద పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పంట నష్టాలపై కేంద్రానికి నివేదిస్తాం
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గత నెలలో వచ్చిన వరదలకు తీవ్రంగా నష్టపోయిన పంటలకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఫైనాన్షియల్ అడ్వైజర్ రవినేష్‌కుమార్ తెలిపారు. గోదావరి వరదలతో నష్టపోయిన పంటలు, ఇళ్లను పరిశీలించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం సభ్యులు గురువారం పర్యటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి సంతృప్తికర దర్శనాన్ని అందించనున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కరోనా తరువాత శ్రీవారి వాహనసేవలను మాడవీధుల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసి సర్వదర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అన్నాచెల్లెళ్ల అనురాగానికి సంకేతమే రాఖీ!!
‘అన్నయ్యా! ఎప్పటికీ నువ్వు ఆనందంగా ఉండాలీ... తమ్ముడూ! విజయాలెన్నో సాధిస్తూ ముందుకెళ్లాలీ’ అంటూ తోబుట్టువుల బాగు కోరుతూ అమితమైన ప్రేమతో రాఖీ కట్టేస్తారు అక్కాచెల్లెళ్లు. వసివాడని ఆ అనుబంధాన్ని రక్షా బంధనాల్లోనూ చూపాలని ఏ సోదరి మాత్రం కోరుకోదూ! అందుకే, అభిరుచులకి తగ్గట్టు మార్కెట్లో తీరొక్క రాఖీలొచ్చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎమ్మెల్యే అల్లుడి కారు బీభత్సం- ఆరుగురు బలి
అతి వేగం ఆరుగుర్ని బలిగొంది. గుజరాత్ ఆనంద్ జిల్లా సోజిత్రా గ్రామం దగ్గర్లో గురువారం సాయంత్రం జరిగిందీ ఘటన. ఆనంద్, తారాపుర్ను కలిపే రాష్ట్ర రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ ఎస్యూవీ.. ఆటోను, బైక్‌ను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న నలుగురు, బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. చికిత్స కోసమని ఓ ఆస్పత్రిలో చేరాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం