- పారిశ్రామిక ప్రమాదాలపై ఉదాసీనత.. కమిటీల ఆర్భాటం తప్ప, నివేదికల ఊసేది !
పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్వడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు విచారణ కమిటీల ఆర్భాటం తప్ప.. అనేక సందర్భాల్లో అసలు ఆ నివేదికల్నిబహిర్గతం చేయలేదు. మిగతాచోట్ల ప్రమాదాలకు ఆస్కారమివ్వకుండా తీసుకోవాల్సిన చర్యలు,.. సిఫార్సులను ఆచరణలో పెట్టడంలేదు. ఈ ఉదాసీన వైఖరే ఇబ్బందికరంగా మారుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వం షాక్.. వారి పింఛన్లు పీకేశారు !
పొరుగు సేవల ఉద్యోగులకు వైకాపా ప్రభుత్వం షాకిచ్చింది. అమ్మఒడి, కాపు నేస్తం, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల్ని ఇప్పటికే నిలిపేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా పింఛన్లకూ కత్తెరేసింది. ఆదాయ పరిమితి నిబంధన తెర మీదకు తెచ్చి.. ఆగస్టు నెలలో వారి కుటుంబ సభ్యుల పింఛన్లు నిలిపేసింది. 10 ఏళ్లుగా వస్తున్న పింఛన్లు కూడా ఎగిరిపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేడు హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త జడ్జీల ప్రమాణం
నేడు హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త జడ్జీలు ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పలమనేరు టెర్రకోట పోటరీ కళాకారులకు అరుదైన గౌరవం..
చిత్తూరు జిల్లా పలమనేరు టెర్రకోట పోటరీ కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. వారు తయారు చేసిన కళా ఖండాలు నూతన పార్లమెంట్ భవనంలో అలంకరణ, ప్రదర్శనకు ఎంపికయ్యాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి టెర్రకోట పోటరీ కళాకారులు పోటీ పడగా.. రాజస్ధాన్, పశ్చిమ బంగాల్, ఆంధ్రప్రదేశ్ కళాకారులు రూపొందించిన వాటిని మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కీలక తీర్పుల్లో భాగస్వామి... తర్వాతి సీజేఐ ఈయనే
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఈ నెల 26 పదవీ విరమణ చేయనున్నారు. మరుసటి రోజున (ఆగస్టు 27న) 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ నియమితులవుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్యాంక్‌ను దోచుకున్న బాలుడు.. క్షణాల్లో రూ.35 లక్షలు మాయం