- frog in upma: ఉప్మాలో కప్ప.. భోజనంలో కాకిీకా.. ఎక్కడంటే..?
ఆహారంలో చీమలు రావడం చూసుంటారు.. పురుగులను చూస్తుంటాం.. అక్కడక్కడ బల్లులు దర్శనమిస్తాయి. బొద్దింకలు, దోమలు, ఈగలు సైతం మేమున్నామని గుర్తుచేస్తుంటాయి.. కానీ ఈసారి రెండు చోట్లు కొత్త జీవులు దర్శనమిచ్చాయి. ఓ చోట ఉప్మాలో కప్ప రాగా.. మరోచోట భోజనంలో కాకీక తలుక్కుమంది.. ఇంతకీ ఎక్కడెక్కడంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Schools Merging: సౌకర్యాలు సమకూరిస్తే విలీనం మంచిదే: జేపీ
రాష్ట్రంలో పాఠశాలల విలీనంపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. బడుల్లో సౌకర్యాలు సమకూరిస్తే విలీనం మంచిదే అని ఆయన అన్నారు. విలీనంతో పాఠశాల దూరాభారమైతే బడి నిర్వహణ ఖర్చును రవాణాపై పెట్టాలని సూచించారు. అయితే దీనిని సరిగ్గా అమలు చేయగలగాలని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మా డబ్బు తీసుకుని మాకే ఇస్తున్నారు: మంత్రి బుగ్గనను నిలదీసిన మహిళ
Gadapa Gadapa program: గడప గడప కార్యక్రమంలో మంత్రి బుగ్గనకు సమస్యలు స్వాగతం పలికాయి. ప్రభుత్వ పథకాలు వివరిస్తుండగా సమస్యలపై మంత్రిని మహిళలు నిలదీశారు. ధరలు పెంచి.. తమ డబ్బు తీసుకుని తమకే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరేమైన ఉరికే ఇస్తున్నారా' అని మంత్రిని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేపాల్ క్యాసినోలకు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు..: వర్ల రామయ్య
Casino issue: రాజకీయ నాయకుల అవినీతి సొమ్ము తెల్లధనంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతున్న క్యాసినోపై.. కేంద్రం దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సగం మంది మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలకు చీకోటి ప్రవీణ్‌తో సంబంధాలున్నాయని ఆరోపించారు. నేపాల్ వెళ్లిన వైకాపా నేతల పేర్లు ఆధారాలు త్వరలో బయటపెడతానన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ముష్కరుల తూటాలకు బెదరని శునకం.. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం
ఉగ్రవాదిని ఆచూకీ కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అక్సెల్ అనే శునకానికి ఆర్మీ అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లో జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఘోరం.. కరెంట్ షాక్‌తో 10 మంది మృతి.. వ్యాన్‌లోని డీజే సిస్టమ్ వల్లే!
Electrocution in West Bengal : కరెంట్ షాక్ తగిలి వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన బంగాల్ కూచ్ బెహార్లో జరిగింది. వ్యాన్ వెనుక భాగంలో ఉన్న డీజే సిస్టమ్ జనరేటర్ వైరింగ్‌లో సమస్యలే ఈ దుర్ఘటనకు కారణమని తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒక్కరికే మళ్లీ మళ్లీ వస్తున్న కరోనా.. ఆ జౌషధమే కారణమా?
Paxlovid Medicine: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని రోజుల క్రితం కొవిడ్ బారినపడ్డారు. అయితే ఆయనకు నాలుగు రోజుల్లోనే నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ టెస్ట్ చేయగా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి జో బైడెన్‌కు చికిత్స అందించడంలో ఉపయోగించిన 'పాక్స్‌లవిడ్' అనే ఔషధంపైకి మళ్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుడ్ న్యూస్.. వంట గ్యాస్ ధర తగ్గింపు.. ఎంతంటే...
LPG price cut news: వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను సోమవారం నుంచి రూ.36 మేర తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా దిల్లీలో ఇప్పటివరకు రూ.2,012.50గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1,976కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కామన్వెల్త్లో భారత్ జోరు.. పసిడి పట్టేసిన జెరెమీ, అచింత.. ఫైనల్లోకి శ్రీహరి
Common Wealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు తన ఖాతాలో వేసుకుంది భారత్. ఆ మూడు కూడా వెయిట్‌లిఫ్టింగ్‌లో వచ్చినవే. తొలి స్వర్ణాన్ని మీరాబాయి చాను అందించగా.. రెండోది జెరెమీ.. మూడోది అచింత అందించాడు. మరోవైపు, భారత మహిళల క్రికెట్లో అమ్మాయిలు పాక్‌ను చిత్తు చేసి సెమీస్ ఆశలు సజీవం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఎందుకో చెప్పలేను!'
Sai Pallavi Favourite Place: తారలు ఖాళీ సమయాల్ని గడిపేందుకు ఒక్కొక్కరు ఒక్కో ప్రదేశాన్ని ఇష్టపడుతుంటారు. ఆ విషయంలో వాళ్లదైన అభిరుచి ప్రతిబింబిస్తుంటుంది. అలా హీరోయిన్ సాయిపల్లవి ఆటవిడుపుగా తరచూ వెళ్లే ప్రదేశం గురించి చెప్పుకొచ్చింది. ఆమెకు బీచ్ అంటే చాలా ఇష్టమట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 9 AM