ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM - ఏపీ ప్రధాన వార్తలు

.

TOP NEWS @ 9 AM
TOP NEWS @ 9 AM

By

Published : Jun 17, 2022, 8:59 AM IST

  • నీళ్లున్నా రైతులకు అందని దుస్థితి
    రాష్ట్రంలో వందల కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు నిర్మించినా.. ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. గండికోట జలాశయం, సర్వారాయ సాగర్, వామికొండ సాగర్‌లో పుష్కలంగా నీళ్లున్నా.. ఆయకట్టుకు నీళ్లందించే ప్రధాన కాల్వలు, పిల్లకాల్వలు తవ్వకపోవడం వల్ల ఉపయోగం లేకుండా పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు మేమే అమ్ముతాం'
    టికెట్‌ ధరలు, అదనపు షోల కుదింపు సమస్యలతో నిన్నమెున్నటి వరకూ ఇబ్బంది పడిన సినీ పరిశ్రమపై ఆన్‌లైన్ టికెట్లు అంటూ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే టికెట్లు విక్రయిస్తుందంటూ ఇచ్చిన ఉత్తర్వులతో ఎగ్జిబిటర్లు తలలు పట్టుకుంటున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో డీజిల్‌ కొరత
    రాష్ట్రంలో డీజిల్‌ కొరత మొదలైంది. కొన్ని బంకుల్లో నిల్వల్లేవనే బోర్డులు కన్పిస్తున్నాయి. ఇంధన కొరతపై కేంద్ర ఇంధన శాఖ, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ అధికారులకు లేఖలు రాసినా స్పందన కొరవడిందని డీలర్లు వాపోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బైక్‌ను ఢీకొట్టిన పాల వ్యాను, అక్కడికక్కడే ముగ్గురు మృతి
    కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'అగ్నిపథ్‌'పై నిరసనల వెల్లువ.. కేంద్రం స్పందన
    స్వల్పకాలానికి జవాన్లను నియమించేందుకు వీలుగా కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్'​ పథకంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. అగ్నిపథ్​ పథకం సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని.. స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మేనకోడలిపై బిజినెస్​మ్యాన్​ అత్యాచారం..
    మేనకోడలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యాపారి. ఈ విషయం ఎవరికైనా చెబితే అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం గ్యాంగ్​తో చంపిస్తానని బెదిరించాడు. ఈ దుర్ఘటన మహారాష్ట్ర, ముంబయిలో వెలుగు చూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టాక్‌ మార్కెట్‌..తగ్గినా.. మంచిదే..! అదెలానో తెలుసుకోండి మరీ..
    స్టాక్‌ మార్కెట్‌.. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు ఉన్న మార్గాల్లో ఇదొకటి. సూచీలు జీవన కాల గరిష్ఠాల నుంచి పడుతూ వస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరవుతున్న వార్తలు వింటూనే ఉన్నాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'నన్ను ఒంటరి చేసి హింసించారు'.. మాజీ కోచ్‌పై మరో సైక్లిస్ట్​ ఆరోపణలు
    జాతీయ సైక్లింగ్‌ మాజీ కోచ్‌ ఆర్కే శర్మ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ భారత టాప్‌ మహిళా సైక్లిస్ట్‌.. ఇటీవలే సాయ్‌కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తాజాగా మరో సైక్లిస్ట్​ దెబోరా హెరాల్డ్​.. ఆర్కేశర్మ తనపై చేయిచేసుకున్నారని, ఒంటరి చేసి హింసించారని ఆరోపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మహేశ్​, అల్లు అర్జున్ సినిమాలు అప్​డేట్స్​.. రంగంలోకి అప్పుడే!
    ఇటీవలే 'సర్కారు వారి పాట' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో మహేశ్ బాబు.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్​తో చేయనున్నారు. అయితే వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ''నిరుద్యోగుల గళమే 'గాడ్సే'.. అదే నన్ను బాలీవుడ్​కు తీసుకెళ్తుంది''
    'గాడ్సే' చిత్రం ఒక రాష్టానికో.. ఓ వర్గానికో సంబంధించిన కాదని, మొత్తం వ్యవస్థకు చెందినదని అన్నారు హీరో సత్యదేవ్​. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details