ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

..

9AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 9 AM

By

Published : May 3, 2022, 9:01 AM IST

  • ఎన్టీపీసీ సింహాద్రిలో నిలిచిన విద్యుదుత్పత్తి.. హుటాహుటిన ప్లాంట్‌కి నిపుణులు
    ఎన్టీపీసీ సింహాద్రిలో 4 యూనిట్లలోని విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. 2 వేల మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లాయి. అయితే.. దాదాపు రెండున్నర గంటల తర్వాత అధికారులు గ్రిడ్‌ నుంచి ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్‌ను పునరుద్ధరించి పాక్షికంగా సరఫరా చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రియాల్టీ షోల పేరుతో ఏదైనా ప్రదర్శిస్తామంటే ఊరుకునేది లేదు: హైకోర్టు
    High Court on Big Boss Show: రియాల్టీ షోల పేరుతో ఏదైనా ప్రదర్శిస్తామంటే ఊరుకునేది లేదని హైకోర్టు హెచ్చరించింది. ఇలాంటి ప్రదర్శనల విషయంలో తాము కళ్లుమూసుకొని లేమని వ్యాఖ్యానించింది. సంస్కృతి పేరు చెప్పి ప్రతీది ప్రదర్శన చేస్తామంటే ఎలా అని నిలదీసింది. రియాల్టీ షోలలో ఏమి చూపిస్తున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నానాటికీ పెరుగుతున్న ధరల భారం.. భారంగా రోజువారీ జీవనం
    Expensive Hike: ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు.. మధ్య తరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఉప్పు, పప్పు, నూనె, పెట్రోల్‌.. ఇలా అన్నింటి ధరలు తగ్గేదే లే అన్న రీతిలో దూసుకెళ్తున్నాయి. మూడేళ్లలో నెలసరి ఇంటి ఖర్చులు ఏకంగా 5 వేలు దాటేశాయి. ఈ ధరాఘాతంతో బతకలేక సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నేడే రంజాన్​.. ముస్లిం సోదరులకు ప్రముఖుల శుభాకాంక్షలు
    Ramzan Wishes: ముస్లిం సోదరులకు సీఎం జగన్​, చంద్రబాబు నాయుడు, పవన్​, నారా లోకేశ్​.. రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మంత్రిని భయపెట్టిన ఎలుక.. అధికారులకు ముచ్చెమటలు!
    UP minister rat bitten: యూపీలో ఓ మంత్రికి ఎదురైన సంఘటన అటు మంత్రికి, అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. మంత్రి అధికార పర్యటన నిమిత్తం బండా జిల్లాలో పర్యటించి.. ఆదివారం రాత్రి ప్రభుత్వ అతిథిగృహంలో బస చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎంబీబీఎస్ విద్యార్థులు 'యోగా' చేయాల్సిందే.. రోజూ గంటపాటు!
    yoga in Mbbs course: ఎంబీబీఎస్ కోర్సులో చేరిన విద్యార్థులందరికీ పాఠ్యాంశంలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ వైద్య కమిషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం అమలులోకి రానున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆమెనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: బిల్​ గేట్స్​
    Bill Gates: మెలిందాతో జరిగిన వివాహం ఎంతో గొప్పదన్నారు మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌. అవకాశం వస్తే.. తననే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటానని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'బిట్‌కాయిన్లన్నీ అమ్మినా.. 25 డాలర్లు ఇవ్వను'
    Warren Buffett Bitcoin: క్రిప్టోలపై తన అనాసక్తిని మరోసారి వ్యక్తపరిచారు బిలియనీర్‌ వారెన్‌ బఫెట్‌. ప్రపంచంలో ఉన్న బిట్‌కాయిన్‌లన్నింటినీ తాను కనీసం 25 డాలర్లకు కూడా కొనబోనని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంతకీ ఆయన ఎందుకిలా అన్నారు?. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వారికి కపిల్ హెచ్చరిక​.. ఆ రిఫరల్​పై ఆలోచించాలన్న గావస్కర్​
    యువ క్రికెటర్లను దిగ్గజ క్రికెటర్​ కపిల్​దేవ్​​​ హెచ్చరించారు. ఓ సీనియర్​ క్రికెటర్​ పేరును ఉదహరిస్తూ అతనిలా అవ్వొద్దని సూచించారు. కాగా, మరో దిగ్గజం సునీల్​ గావస్కర్ నో బాల్‌ విషయంలో తన అభిప్రాయాన్ని తెలిపారు. దానిపై ఐసీసీ ఆలోచించాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Tollywood: 4 నెలలు.. 25కుపైగా సినిమాలు.. హిట్లెన్ని.. ఫట్లెన్ని?
    ఓవైపు కరోనా.. మరోవైపు టికెట్‌ రేట్ల సమస్యలు.. ఇలా ఒక్కో సమస్యను దాటుకుంటూ కొత్త సినీ క్యాలెండర్​లో పలు చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో కొన్ని భారీ కలెక్షన్లను అందుకోగా మరికొన్ని బోల్తా పడ్డాయి. ఆ చిత్రాలేంటో ఓ సారి గుర్తుచేసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details