- Union Budget 2022: డిజిటల్ భారత్‌కు 'బడ్జెట్' రైట్ రైట్..
దేశాన్ని 'డిజిటల్ ఇండియా'గా తీర్చిదిద్దేందుకు ఈసారి బడ్జెట్‌లో సాంకేతికతపై ప్రత్యేక దృష్టిసారించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా డిజిటల్ కరెన్సీని తీసుకురానుంది. స్పెక్ట్రం వేలంతో 5జీ అందుబాటులోకి తీసుకురానుంది. వీటితో పాటు క్రిప్టో లావాదేవీలపై 30శాతం పన్ను, మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు, వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన సహా మరిన్ని అంశాలను ప్రస్తావించారు. అయితే ఈ బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మళ్లీ మొండిచెయ్యే... బడ్జెట్ ప్రసంగంలో వినిపించని ఏపీ పేరు
ఆశగా ఎదురుచూసి ఆంధ్రప్రదేశ్‌కి మళ్లీ మొండిచెయ్యే ఎదురయ్యింది. ఏపీకి తీరని ద్రోహం జరిగింది. మరోసారి దగాపడింది. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ఏపీపేరే ఎక్కడా వినిపించలేదు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లవుతున్నా... ఆ గాయాల నుంచి ఇంకా కోలుకోని ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కనీస కనికరం సైతం చూపలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Polavaram: పోలవరానికి ఇలా.. కెన్-బెత్వాకు అలా
బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం.. పోలవరం ప్రాజెక్టును మరోసారి విస్మరించింది. నిధుల కేటాయింపుల్లో పాత వైఖరిని అవలంభించింది. రూ.30 వేల కోట్లు కావాల్సి ఉండగా.. పైసా కేటాయించలేదు. యూపీ, ఎంపీ ఉమ్మడి ప్రాజెక్టు కెన్-బెత్వాకు మాత్రం రూ. 44 వేల కోట్లకు పైనే కేటాయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Employees Chalo Vijayawada: 'చలో విజయవాడ'కు ప్రభుత్వం ఆంక్షలు.. రంగంలోకి పోలీసులు
ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లోని ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేసి.. కార్యక్రమానికి వెళ్లొదని నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ముస్తాబైన ముచ్చింతల్.. నేటి నుంచి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు
సమతకు చిహ్నమైన దివ్యమూర్తి శ్రీరామానుజాచార్య.. సహస్రాబ్ది సమారోహానికి తెలంగాణలోని శంషాబాద్.. ముచ్చింతల్ దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి 12 రోజులపాటు జరిగే ఉత్సవాలకు జీయర్ ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. చిన్నజీయర్ స్వామి స్వయం పర్యవేక్షణలో జరగనున్న సమతామూర్తి విగ్రహావిష్కరణ.. సాయంత్రం 5 గంటలకు అంకురార్పరణ జరగనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనమే టాప్! కానీ..
భారత్‌కు ఆధునికత నేర్పాం... ముందుకు నడిపించాం అని చెప్పే ఆంగ్లేయులు అత్యంత దారుణంగా మనల్ని తిరోగమనంలోకి నెట్టారు. వందల ఏళ్ల పాటు సుసంపన్న ఆర్థిక శక్తిగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారతావనిని అట్టడుగుకు తీసుకొచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- UP election 2022: 'భాజపా అధికారంలోకి వస్తే.. ఉచితంగా 'డబుల్ రేషన్''
యూపీలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతినెలా ఉచితంగా డబుల్ రేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్రపంచంలోనే అతిపెద్ద మెరుపు.. 770 కిలోమీటర్ల మేర వ్యాప్తి
ప్రపంచంలోనే అతి పెద్ద మెరుపును అమెరికాలో గుర్తించినట్లు ఐరాసకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజాగా వెల్లడించింది. 2020 ఏప్రిల్‌లో అమెరికా దక్షిణ ప్రాంతంలో దాదాపు 770 కిలోమీటర్ల మేర వ్యాపించిన ఈ మెరుపు సరికొత్త రికార్డును నెలకొల్పినట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. అయితే ఈసారి మహిళల జట్లు మాత్రమే పోటీపడనున్నాయి. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఈ గేమ్స్ జరగనున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Kareena Kapoor Khan: కరీనాతో జాగ్రత్త.. సైఫ్‌కు అక్షయ్ హెచ్చరిక!
బాలీవుడ్లో కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ జంటకు మంచి క్రేజ్ ఉంది. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహానికి ముందు వీరు సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్.. కరీనాకు దూరంగా ఉండాలని సైఫ్‌తో చెప్పారట. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి