ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@9AM - 9AM TOP NEWS

ప్రధాన వార్తలు@9AM

9AM TOP NEWS
ప్రధాన వార్తలు@9AM

By

Published : Dec 20, 2021, 9:01 AM IST

  • govt on apsrtc pf: ఆర్టీసీ భవిష్యనిధిపై సర్కారు కన్ను

govt on apsrtc pf: ఆర్టీసీ భవిష్యనిధిపై సర్కారు కన్నేసింది. పీఎఫ్‌ ట్రస్టులో ఉన్న రూ.1600 కోట్లను కార్పొరేషన్​లో జమ చేయాలని సంస్థతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అందుకు ఆర్టీసీ యాజమాన్యం మొగ్గు చూపలేదని సమాచారం.

  • corona effect on granite: గ్రానైట్​పై కరోనా బండ.. కోలుకోని పరిశ్రమలు

కొవిడ్‌ ప్రభావం నుంచి గ్రానైట్‌ పరిశ్రమ తేరుకోలేదు. డిమాండ్‌ లేక చైనాకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఓషియన్, ఫ్రైట్‌ ఛార్జీలతో పాటు ప్రభుత్వం పెంచిన పన్నులు లీజుదారులకు గుదిబండగా మారాయి.

  • మూడో వారంలో మరింత తగ్గిన రాజ్యసభ ఉత్పాదకత

రాజ్యసభ శీతాకాల సమావేశాల ఉత్పాదకత మూడో వారంలో కనిష్ఠానికి చేరుకుంది. కేవలం 37.60 శాతం మాత్రమే నమోదైంది. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించి విపక్షాల ఆందోళనలతో ఏర్పడిన అంతరాయాలు, తప్పనిసరి వాయిదాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

  • ఓటరు జాబితాతో ఆధార్‌ అనుసంధానం!

ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించేందుకు వీలు కల్పించే 'ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021'ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టనుంది. ఓటరు జాబితాలో డూప్లికేషన్‌ను నివారించే లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.

  • ఫిలిప్పీన్స్ తుపాను విలయంలో 208కు చేరిన మృతులు

Philippines typhoon death: ఫిలిప్పీన్స్​లో సంభవించిన తుపాను ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రకృతి విపత్తుకు 208 మరణించినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు.

  • శక్తివంతమైన వ్యాక్సిన్‌ దిశగా శాస్త్రవేత్తల ముందడుగు

వ్యాక్సిన్ల రూపకల్పన దిశగా జపాన్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. శక్తిమంతమైన వ్యాక్సిన్లు అభివృద్ధి చేసే విధంగా ఓ ప్రాథమిక అంశాన్ని గుర్తించారు. ఈ మెరుగైన టీకాలతో బూస్టర్ డోసులు అవసరం లేకుండానే వ్యాధుల నుంచి దీర్ఘకాల రక్షణ సాధ్యమవుతుందని భావిస్తున్నారు.

  • 2020-21లో భారత వృద్ధి రేటు 9-10 శాతం: సీఐఐ

దేశ జీడీపీ వృద్ధి బలంగా పుంజుకుని 9-10 శాతం మధ్య నమోదు కావొచ్చని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ మండలిలో సభ్యులుగా ఉన్న సీఈఓలు అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రభావం సేవలు, తయారీ రంగంపై పడుతుందనే ఆందోళన సీఐఐ నిర్వహించిన పోలింగ్​లో​ వ్యక్తమైంది.

  • Kidambi Srikanth: ప్రపంచ బ్యాడ్మింటన్​లో పడిలేచిన కెరటం

ఒకే ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు.. అందులో వారం వ్యవధిలో గెలిచినవి రెండు.. ఆపై కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం.. ఈ క్రమంలోనే ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకు.. 2017-18 మధ్య కిదాంబి శ్రీకాంత్‌ జోరుకు నిదర్శనాలివి.

  • Salman Khan: సూపర్‌హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ ప్రకటించిన సల్మాన్‌ఖాన్‌

Salman Khan: తన సూపర్​హిట్​ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్. 2015లో వచ్చిన 'బజరంగీ భాయిజాన్​' సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.

  • నాయిక డైరీ.. 'ఒక్కటే మరి'

తెలుగు పరిశ్రమలో అగ్ర కథానాయికలు ఎప్పుడూ బిజీనే. ఒక్కో ఏడాది నాలుగైదు సినిమాలు అవలీలగా చేసేస్తుంటారు. వాళ్లకున్న డిమాండ్‌ అలాంటిది. అందుకు తగ్గట్టుగా వేగమూ ప్రదర్శిస్తుంటారు. రెండేళ్లుగా కరోనా కలవరపెడుతున్నా కథానాయికలు ఎప్పట్లాగే ఫామ్‌ని కొనసాగించే ప్రయత్నం చేశారు.

ABOUT THE AUTHOR

...view details