- earthquake: విశాఖలో పలుచోట్ల భూప్రకంపనలు
విశాఖ నగరంలో స్వల్పంగా భూమి కంపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అక్కయ్యపాలెం, మధురానగర్, తాటిచెట్లపాలెం, అల్లిపురం, ఆసిల్‌మెట్ట, సీతమ్మధార, అల్లిపురం, రైల్వేస్టేషన్, హెచ్‌బీకాలనీ, జ్ఞానాపురం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
- POLLING START: స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
ఉదయం 7 గంటలకే 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
- Southern Zonal Council: నేడు తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ.. ఏపీ అజెండా ఏంటంటే!
ఆదివారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తిరుపతి వేదికగా సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ కానుంది(southern zonal counci meet ) అయితే ఈ సమావేశానికి ఏపీ నుంచి ఓ కీలకమైన ప్రతిపాదన వచ్చినట్టు కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో ముఖ్యంగా.. 3 రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులివ్వాలని ఉన్నట్టు స్పష్టం చేసింది.
- PADAYATRA: నేడు అమరావతి మహాపాదయాత్ర.. పునః ప్రారంభం
ప్రకాశం జిల్లా నిడమనూరులోని వార్డులో ఉపఎన్నిక(by-poll in nidamanoor) కారణంగా మహాపాదయాత్రకు విరామం ప్రకటించిన రైతులు.. ఇవాళ ఉదయం 8 గంటలకు తిరిగి ప్రారంభించనున్నారు. 12వ రోజు పాదయాత్ర ప్రకాశం జిల్లా యరజర్ల శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఆగింది.
- మేలిమి విద్యే దేశానికి పెన్నిధి- నేటి బాలలే రేపటి నిపుణులు
అందరికీ ప్రాథమిక విద్య అందించాలని, కొత్త విద్యావిధానాన్ని చేపట్టాలని 1966లో కొఠారీ కమిషన్ సిఫార్సు చేసింది. త్రిభాషా సూత్రం పాటించాలని, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల వినియోగం, పారిశ్రామిక, వ్యవసాయ విద్య, వయోజన విద్యా కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. మారుతున్న సాంఘిక, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 1986లో కొత్త విద్యావిధానాన్ని చేపట్టింది.
- బీఎస్పీ అధినేత్రి మాయావతికి మాతృవియోగం