- సీలేరు నదిలో ఎనిమిది మంది గల్లంతు.. చిన్నారి మృతదేహం లభ్యం!
విశాఖ జిల్లా సీలేరు నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు నాటు పడవలు ప్రమాదానికి గురయ్యాయి. పడవలు నీట మునగడంతో 8 మంది గల్లంతు కాగా, వారిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏపీ ఉన్నత విద్య కమిషన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం
రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో రుసుముల ఖరారు విషయంలో ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రుసుముల ఖరారులో చట్ట నిబంధనలు పాటించడంలేదంటూ కమిషన్ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- గుంటూరు అర్బన్ ఎస్పీకి కోర్టు ధిక్కరణ నోటీసు పంపిన రఘురామ న్యాయవాది
ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ ఆయన తరఫు న్యాయవాది కె.దుర్గాప్రసాద్.. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి సోమవారం కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేశారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- పదో తరగతి పరీక్షలు వాయిదా?
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. నెల రోజుల సమయం కావాలంటూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- నష్ట నివారణపై భాజపా-ఆర్ఎస్ఎస్ దృష్టి!
దిల్లీలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే మధ్య జరిగిన సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా కట్టడిలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు నిరాశ కల్గిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- వైద్యరంగానికి సమూల చికిత్స