- ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు కన్నుమూత
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు కన్నుమూత మూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు శోభానాయుడు. 1956 విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించారు. కూచిపూడి నృత్యంలో వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కుండపోత వానలు...
తీవ్ర వాయుగుండం కోస్తాలో బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాల్ని నీట ముంచింది. లక్షన్నర ఎకరాల్లో పంట పొలాలను మింగేసింది. వాగులు, వంకలను ఏకం చేసింది. నలుగురిని బలి తీసుకుంది. మరో నలుగురు గల్లంతయ్యారు. తీర ప్రాంత జిల్లాల ప్రజలను 2 రోజులుగా వణికించిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల మధ్య కాకినాడ సమీపంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో తీరందాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తీవ్రవాయుగుండం.. ఉభయగోదావరి జిల్లాలకు గండం!
కాకినాడ వద్ద తీరం దాటిన వాయుగుండం.... ఉభయగోదావరి జిల్లాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండుజిల్లాల్లోనూ భారీవర్షాలతో అనేకచోట్ల ఇళ్లు, పొలాలు నీటమునిగాయి. విద్యుత్తు సరఫరా సహా రాకపోకలకు అంతరాయం కలిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'న్యాయమూర్తులపై ఏపీ ప్రభుత్వ ఆరోపణలు కచ్చితంగా కోర్టు ధిక్కరణే'
కోర్టులపైన, న్యాయమూర్తులపై ఇటీవల కాలంలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తాయని మాజీ అడ్వకేట్ జనరల్ కె. రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈనాడు, ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... ఏపీ ప్రభుత్వం తీరుతో న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నిధుల కొరతతో కోమాలో దేశారోగ్యం
ప్రఖ్యాత 'ఆక్స్ ఫామ్' సంస్థ అసమానతల తగ్గింపు నిబద్ధతా సూచీని వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం సర్వే నిర్వహించిన 158 దేశాల్లో 129వ స్థానానికి భారత్ పరిమితమైంది. బడ్జెట్లో ఆరోగ్యానికి కేటాయింపులు 4 శాతానికి మించటంలేదని పేర్కొంది. ఇది ప్రపంచంలోనే నాలుగో అత్యంత కనిష్ఠ వ్యయంగా స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజులకే విధుల్లోకి కలెక్టర్