- జనతా బజార్లు
రైతులు పండించిన ఉత్పత్తులకు స్థానికంగా మార్కెటింగ్ కల్పించే చర్యల్లో భాగంగానే రాష్ట్రంలో జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రైతులు పండించిన ఉత్పత్తులను స్థానికంగానే మార్కెటింగ్ కల్పించడం ద్వారా గిట్టుబాటు ధర కల్పించి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి రైతుభరోసా కేంద్రం పరిధిలో శీతల గిడ్డంగి, గోదాములు తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'బాబాయ్ ఆరోగ్యంపై ఆందోళన'
అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. డిశ్ఛార్జి చేయడంలో ప్రభుత్వ ఒత్తిళ్లు ఉన్నాయని.. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. శస్త్రచికిత్స చేయించుకున్న తన బాబాయ్ ఆరోగ్యంగా ఉంటే.. వీల్‌చైర్‌పై ఎందుకు తరలించాలని ఆయన ప్రశ్నించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- సీఎం లేఖ రాసినా..
మందాకిని బొగ్గు గనిని కేంద్రం కర్ణాటకకు కేటాయించింది. క్యాప్టివ్ మైనింగ్ కింద తీసుకోవాలన్న జెన్‌కో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒడిశాలోని తాల్చేరు గనికి బదులుగా దీన్ని కేటాయించాలని కోరుతూ సీఎం కేంద్రానికి లేఖ రాసినా పరిగణనలోకి తీసుకోలేదు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఆన్‌లైన్ చదువులు
ఈ విద్యాసంవత్సరానికి ఆన్‌లైన్ తరగతులే స్వాగతం పలకనున్నాయి. కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు సాధారణానికి వచ్చేదాకా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాకే... నేరుగా బోధన చేపట్టే దిశగా పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక అకడమిక్ కేలండర్‌ను రూపొందిస్తోంది. పాఠ్యాంశాలను 30% తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- డిజిటల్ సాయం
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో డిజిటల్ విద్యను అందించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది కేంద్రం. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇచ్చే యోచనలో ఉంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ. 60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- గ్రీన్ సిగ్నల్