- ఉపసంహరణ
సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ తరఫున పిటిషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసే అడ్వొకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్) బాధ్యతలు నిర్వర్తిస్తున్న న్యాయవాది జి.నాగేశ్వరరెడ్డి సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రహదారిపై చిరుత
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ-అహోబిలం రహదారిలో సోమవారం రాత్రి చిరుత సంచరించింది. దుర్గమ్మ గుడి వద్ద తెలుగుగంగ కాల్వ వంతెన దాటగానే ఉన్న రహదారిపై అడ్డంగా కూర్చొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలుగు రాష్ట్రాల్లో బంద్
జీవో 3 రద్దుకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నేడు బంద్‌కు పిలుపునిచ్చింది జీవో 3 సాధన కమిటీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేసి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా జీవో 3 చట్టం తేవాలని డిమాండ్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉత్తరాంధ్రలో నేడు భారీ వర్షాలు
వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నీటిలో కోతుల మృతదేహాలు
అసోంలోని కాఛార్ జిల్లాలో కోతుల మృతదేహాలు కలకలం రేపాయి. దాదాపు 13 వానరాలు.. ఓ నీటి సరఫరా ప్లాంట్లో తేలుతూ కనిపించాయి. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఎవరో కావాలనే జలాశయాన్ని విషపూరితం చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తీరు మారని చైనా